Chatha Pacha The Ring of Rowdies: మమ్ముట్టి పాత్రే.. టర్నింగ్ పాయింట్
ABN, Publish Date - Feb 08 , 2026 | 06:40 AM
మలయాళంలో ఘన విజయం సాధించిన ‘చథాపచ్చ: ది రింగ్ ఆఫ్ రౌడీస్’ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సురేశ్ ప్రొడక్షన్స్ సిద్ధమైంది.
మలయాళంలో ఘన విజయం సాధించిన ‘చథాపచ్చ: ది రింగ్ ఆఫ్ రౌడీస్’ (Chatha Pacha: The Ring of Rowdies) చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సురేశ్ ప్రొడక్షన్స్ సిద్ధమైంది. రోషన్ మాథ్యూ, విశాఖ్ నాయర్, ఇషాన్ ప్రధాన పాత్రల్లో అద్వైత్ నాయర్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఈనెల 13న సురేశ్ ప్రొడక్షన్స్ విడుదల చేస్తోంది.
ఈ సందర్భంగా శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో రోషన్ మాథ్యూ మాట్లాడుతూ ‘ఈ చిత్రంలో మమ్ముట్టి గారు ఒక ప్రత్యేక పాత్రలో నటించారు. ఈ సినిమాకు ఆయన పాత్రే టర్నింగ్ పాయింట్. మలయాళంలో వచ్చిన స్పందనే ఇక్కడా వస్తుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు. సురేశ్ ప్రొడక్షన్స్ ప్రతినిధి ప్రవీణ్ మాట్లాడుతూ ‘స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. కచ్చితంగా తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుంది’ అని అన్నారు.