సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సినిమా ఈవెంట్ల హబ్‌.. మల్లారెడ్డి యూనివర్సిటీ గుర్తింపు రద్దు చేయాలి

ABN, Publish Date - Oct 27 , 2026 | 11:43 AM

మేడ్చల్‌–మల్కాజ్‌గిరి జిల్లా మల్లారెడ్డి యూనివర్సిటీపై విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ తీవ్ర విమర్శలు చేసింది.

Malla Reddy University

మేడ్చల్‌–మల్కాజ్‌గిరి (Medchal Malkajgiri) జిల్లాలోని మల్లారెడ్డి యూనివర్సిటీ (Malla Reddy University)పై విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ (AISF) తీవ్ర విమర్శలు చేసింది. ల‌క్ష‌లు ల‌క్ష‌లు ఫీజులు వ‌సూలు చేస్తోన్న యూనివర్సిటీ విద్యార్థులతో ఆటలాడుతోందని, చదువుల కంటే సినిమా ఈవెంట్లకు ప్రాధాన్యం ఇస్తోందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు మణికంఠ రెడ్డి, పుట్ట లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

విశ్వవిద్యాలయాన్ని సినిమా ఈవెంట్ల హబ్‌గా మార్చారని, వెంటనే సంస్థ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీలో తరగతులు నిర్వహించకుండా సినిమాలు చూడాలని విద్యార్థులకు సెలవులు ఇస్తున్నారని సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. 'తల్లిదండ్రులు ఫీజులు కట్టేది విద్యార్థులను సినిమా ఈవెంట్లకు పంపడానికా లేక సినిమాలు చూపించడానికా అని ప్రశ్నించారు.

ఇటీవ‌ల వెంక‌టేశ్ న‌టించిన ఆతద‌ర్శ క‌టుంబం (Aadarsha Kutumbam House) సినిమా ఈవెంట్ మ‌ల్లా రెడ్డి యూనివ‌ర్సిటీలో జ‌రుగ‌గా సినిమా రిలీజ్ రోజు విద్యార్థుల‌కు హాలీడే ఇస్తున్న‌ట్లు సంస్థ వైస్ చైర్మెన్‌ ప్రీతీ రెడ్డి (Preeti Reddy) స్టేజీపై బ‌హిరంగంగా ప్ర‌క‌టించారు. దీంతో ఇప్పుడు ఈ వ్యాఖ్య‌లు పెద్ద చ‌ర్చ‌కు దారి తీశాయి. ఈ క్ర‌మంలోనే ప‌లు విద్యార్థి సంఘాలు, నెటిజ‌న్లు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు చేస్తున్నారు. అంతేకాదు రెండు నెల‌ల క్రితం టాక్సిక్ ఈవెంట్ సైతం ఇదే యూనివ‌ర్సిటీలో జ‌రుగ‌గా ప‌రిస్థితి అదుపుత‌ప్పి చిన్న ప్ర‌మాదం సైతం చోటు చేసుకున్న సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.

Updated Date - Oct 27 , 2026 | 11:43 AM