సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఎన్టీఆర్- త్రివిక్రమ్ టైటిల్ మారిందిరో..

ABN, Publish Date - Aug 18 , 2026 | 07:09 PM

మ్యాన్ ఆన్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో డ్రాగన్(Dragon) సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే.

God Of War

మ్యాన్ ఆన్ మాసెస్ ఎన్టీఆర్ (NTR) ప్రస్తుతం కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో డ్రాగన్(Dragon) సినిమాతో బిజీగా ఉన్న విషయం తెల్సిందే. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుండగా, దీని తర్వాత ఎన్టీఆర్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) తో ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీడెడ్, ఆంధ్రా బాక్సాఫీస్ వద్ద మాస్ రికార్డులను తిరగరాసిన ఆ కాంబో మళ్లీ రిపీట్ అవుతుండటంతో అభిమానుల్లో క్రేజ్ ఆకాశాన్ని తాకుతోంది.


ఈ సారి ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమాను కేవలం ఫ్యామిలీ లేదా రొటీన్ మాస్ ఎలిమెంట్స్ తో కాకుండా సోషియో-ఫాంటసీ, పౌరాణిక కలయికతో లార్జర్ దాన్ లైఫ్ స్కేల్ లో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు త్రివిక్రమ్. ఈ చిత్రంలో కుమారస్వామిగా ఎన్టీఆర్ కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్ సోషల్ మీడియాని షేక్ చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి గాడ్ ఆఫ్ వార్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. అయితే ఈ టైటిల్ కాకుండా మరో టైటిల్ ని కూడా మేకర్స్ రిజిస్టర్ చేయించినట్లు టాక్ నడుస్తోంది.


ఇటీవలే ఈ ప్రాజెక్ట్ కోసం గాడ్ ఆఫ్ వార్ అనే టైటిల్ తో పాటు దేవసేనాపతి అనే రెండు పవర్ ఫుల్ టైటిల్స్ ను ప్రొడక్షన్ హౌస్ రిజిస్టర్ చేయడం విపరీతమైన చర్చకు దారితీసింది. గాడ్ ఆఫ్ వార్ వైరల్ అయినా కూడా దేవసేనాపతి టైటిల్ చాలా బావుందని, దాన్ని ఫైనల్ చేయమని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. డ్రాగన్ లాంటి పక్కా మాస్ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో రాబోతున్న ఈ మైథలాజికల్ యాక్షన్ డ్రామాతో ఎన్టీఆర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తాడో చూడాలి.

Updated Date - Aug 18 , 2026 | 07:09 PM