సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ఒరిజిన‌ల్‌ ప్లేయ‌ర్స్‌తో.. 'మహిళా కబడ్డీ'

ABN, Publish Date - Mar 01 , 2026 | 08:58 AM

మహిళా కబడ్డీ టీమ్ ప్లేయర్ పూజ నర్వాల్ తో పాటు ఏడుగురు కబడ్డీ క్రీడాకారులు కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం మహిళా కబడ్డీ.

kabaddi

పూజ నర్వాల్ (Pooja Narwal), శ్రీనివాస్ రెడ్డి (Srinivas Reddy), అక్సాఖాన్, సుమన్, ఆమని, ఇంద్రజ ప్రధాన పాత్రధారులుగా ఆర్కే ఫిల్మ్స్ బ్యానర్‌పై ప్రతాని రామకృష్ణగౌడ్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తోన్న చిత్రం మహిళా కబడ్డీ (Mahila Kabaddi). ఇందులో ఇండియన్ కబడ్డీ టీమ్ కోచ్ శ్రీనివాస్ రెడ్డి, భారత మహిళా కబడ్డీ టీమ్ ప్లేయర్ పూజ నర్వాల్ తో పాటు ఏడు గురు కబడ్డీ క్రీడాకారులు కీలక పాత్రల్లో నటిస్తు న్నారు.

శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రతాని రామకృష్ణగౌడ్ మాట్లాడుతూ 'పల్లెటూరి నుంచి వచ్చిన ఒక పేద అమ్మాయి. కబడ్డీ ఆటలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎలా పేరు తెచ్చుకుంది? ఆ క్రమంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంది అనే కథాంశంతో 'మహిళా కబడ్డీ' చిత్రాన్ని రూపొందిస్తున్నాను. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యింది. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తాం' అన్నారు.

Updated Date - Mar 01 , 2026 | 08:58 AM