సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Varanasi: రాజమౌళి హిస్టరీలోనే ఫస్ట్ టైమ్..

ABN, Publish Date - May 25 , 2026 | 12:13 PM

ప్రస్తుతం ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ ఏది అంటే.. అందరి నోటా వినిపించే ఏకైక పేరు వారణాసి(Varanasi). గ్లోబల్ వైడ్‌గా ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Varanasi

ప్రస్తుతం ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ ఏది అంటే.. అందరి నోటా వినిపించే ఏకైక పేరు వారణాసి(Varanasi). గ్లోబల్ వైడ్‌గా ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దీనికి అసలైన కారణం.. టాలీవుడ్ కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా స్థాయిని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టారు మన జక్కన్న. ఆ తర్వాత వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రంతో ఆస్కార్ అవార్డును సైతం భారతీయ ప్రేక్షకుల సొంతం చేసి హిస్టరీ క్రియేట్ చేశారు. దీంతో ఆయన నుంచి వచ్చే తదుపరి సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే జక్కన్న (SS Rajamouli) కూడా తన విజన్‌ను సినిమా సినిమాకు నెక్స్ట్ లెవెల్‌కు అప్‌గ్రేడ్ చేసుకుంటూ వెళ్తున్నారు.




ఈ క్రమంలోనే సూపర్‌ స్టార్‌ మహేష్ బాబుతో తెరకెక్కిస్తున్న వారణాసి సినిమాను మునుపెన్నడూ చూడని రీతిలో భారీ కాన్సెప్ట్‌తో తెరకెక్కిస్తున్నారు. శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ, ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దాదాపు 1300 కోట్ల భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ రేంజ్‌లో ఈ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటోంది. అయితే ఈ సినిమా గురించి ఇప్పుడు ఒక క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌చల్ చేస్తోంది. అదేంటంటే.. ఈ చిత్రం ఇప్పటికే 80 శాతానికి పైగా షూటింగ్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఇప్పటివరకు సినిమాకు సంబంధించిన సాంగ్స్, రామాయణ బ్యాక్‌డ్రాప్ ఎపిసోడ్స్, అంటార్కిటికా అలాగే దట్టమైన అడవుల్లో సాగే అడ్వెంచరస్ సీన్స్ అన్నింటినీ జక్కన్న పక్కాగా కంప్లీట్ చేసేశారు. ఇక అసలు విషయానికి వస్తే.. జూన్ చివరి వారం నుంచి ఈ సినిమా సరికొత్త, అత్యంత కీలకమైన లాంగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేసింది. ఈ షెడ్యూల్‌లో సినిమాలోని ప్రధాన యాక్షన్ బ్యాక్‌డ్రాప్ సీన్స్‌ను తెరకెక్కించనున్నారట. ఎందుకంటే ఈ లాస్ట్ అండ్ ఫైనల్ షెడ్యూల్‌తో సినిమా టాకీ పార్ట్ మొత్తం క్లోజ్ చేయాలని రాజమౌళి పట్టుదలతో ఉన్నారట. మరో వైపు మహేష్ కూడా ఈ సినిమా కోసం ఎన్నడూ పడనంత కష్టం పడుతున్నారు. ఇప్పటికే మహేష్ వారణాసి కోసం కలరిపయట్టును నేర్చుకోవడం, బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌ కూడా చాలా కొత్త గా ఉంది. ఈ చిత్రంలో మహేష్ కు జోడీగా ప్రియాంక చోప్రా నటిస్తుండగా, పృద్వీరాజ్‌ సుకమారన్‌ నెగిటివ్‌ రోల్‌ పోషిస్తున్నారు.




సాధారణంగా రాజమౌళి సినిమా సెట్స్ పైకి వెళ్ళిందంటే.. రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఎవరూ ఊహించలేరు. షూటింగ్ పూర్తయ్యాకే డేట్ అనౌన్స్ చేయడం ఆయన స్టైల్. కానీ ఈసారి మాత్రం జక్కన్న తన రూట్ మార్చారు. ముందే రిలీజ్ డేట్‌ను లాక్ చేసి, దానికి తగినట్టుగానే పక్కా ప్రణాళికతో షూటింగ్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. నడుస్తున్న షెడ్యూల్స్ మధ్యలో మిడిల్ ఈస్ట్ కంట్రీస్‌లో కొన్ని ఊహించని ఇబ్బందులు తలెత్తాయి. అక్కడ షూటింగ్ చేయడం కష్టతరంగా మారడంతో.. రాజమౌళి అస్సలు తగ్గలేదు. వెంటనే తన ప్లాన్ బి ని అమలు చేసి, ఎక్కడా బ్రేక్స్ పడకుండా షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుంటూ వచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వారణాసి సినిమా రిలీజ్ పోస్ట్‌పోన్ కాకూడదనే పట్టుదలతో తన వర్కింగ్ స్టైల్‌ను, విజన్‌ను పూర్తిగా మార్చేసుకున్నారు జక్కన్న. పూర్తి ఐ మ్యాక్స్‌ ఫార్మెట్‌తో హాలీవుడ్ రేంజ్ విజువల్స్, నెవ్వర్ బిఫోర్ యాక్షన్ ఎపిసోడ్స్‌తో రాబోతున్న ఈ వారణాసి అడ్వెంచర్.. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను తిరగరాయబోతుందో చూడాలి.

Updated Date - May 25 , 2026 | 12:19 PM