సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Varanasi: మహేష్ రాముడి లుక్.. వచ్చేది అప్పుడే

ABN, Publish Date - Jul 08 , 2026 | 01:14 PM

యావత్ భారతదేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ గ్లోబల్ ప్రాజెక్ట్ వారణాసి(Varanasi). సూపర్‌స్టార్‌ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SSRajamouli) తెరకెక్కిస్తోన్న ఈ విజువల్ వండర్‌ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లేందుకు జక్కన్న రేయింబవళ్లు శ్రమిస్తున్నారు.

యావత్ భారతదేశం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ గ్లోబల్ ప్రాజెక్ట్ వారణాసి(Varanasi). సూపర్‌స్టార్‌ మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా, దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SSRajamouli) తెరకెక్కిస్తోన్న ఈ విజువల్ వండర్‌ను హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లేందుకు జక్కన్న రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. అంతర్జాతీయ ఆడియన్స్‌ను సైతం కట్టిపడేసేలా ప్రతి ఫ్రేమ్‌ను డిజైన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబంధించి చిత్ర బృందం తాజాగా ఒక సూపర్ కిక్ ఇచ్చే అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమా మేజర్‌ పార్ట్ షూటింగ్ ఇప్పటికే అఫీషియల్‌గా కంప్లీట్ అయిందని, మిగిలిన కీలక సన్నివేశాలు, ప్యాచ్ వర్క్ అంతటినీ ఈ ఏడాది అక్టోబర్ నాటికే పూర్తి చేయాలనే లక్ష్యంతో యూనిట్ పని చేస్తోందని ప్రకటించారు. వీఎఫ్ఎక్స్ పనుల కోసం ముందస్తుగానే హాలీవుడ్ నిపుణులు రంగంలోకి దిగినట్లు సమాచారం.


ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అందరి దృష్టి ఆగస్టులో రాబోయే సూపర్‌స్టార్ మహేష్ బాబు పుట్టినరోజుపై పడింది. గతేడాది రిలీజ్ చేసిన వారణాసి ప్రీ-గ్లింప్స్‌లో రుద్రగా మహేష్ బాబు ఇంటెన్స్ లుక్‌ను కొద్దిగా చూపించి, రామాయణ కనెక్షన్‌తో జక్కన్న మైండ్ బ్లాక్ చేశారు. ఇప్పుడు ఈ బర్త్‌డేకి కేవలం ఒక పోస్టర్‌తో సరిపెడతారా లేదా రోమాలు నిక్కబొడుచుకునేలా ఒక పవర్ ఫుల్ గ్లింప్స్ రిలీజ్ చేస్తారా అనే చర్చ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఇప్పటికే శ్రీరాముడి గెటప్‌లో ఉన్న మహేష్ బాబు ఫ్యాన్-మేడ్ లుక్స్ విపరీతంగా వైరల్ అవుతుండగా.. ఈ బర్త్‌డే కానుకగా రాజమౌళి స్వయంగా మహేష్ బాబు అఫీషియల్ 'శ్రీరాముడి లుక్‌ను రివీల్ చేసి సంచలనం సృష్టించబోతున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇదే కనుక జరిగితే సోషల్ మీడియా షేక్ అవ్వడం ఖాయం.


ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం తదుపరి యాక్షన్ షెడ్యూల్స్ కోసం ఇండస్ట్రీలో ముందెన్నడూ లేని విధంగా భారీ సెట్స్ ముస్తాబవుతున్నాయి. ఈ విజువల్ వండర్‌ను వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంతర్జాతీయ భాషల్లో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్స్ తర్వాత రాజమౌళి - మహేష్ బాబు కాంబోలో వస్తున్న ఈ వారణాసి చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించబోతుందో, గ్లోబల్ లెవెల్లో ఎన్ని సరికొత్త రికార్డులను తిరగరాయబోతుందో చూడాలి.

Updated Date - Jul 08 , 2026 | 01:31 PM