సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Maheshbabu: మహేష్ బాబు - లోకేష్ కాంబోలో సినిమా.. నిజమేనా?

ABN, Publish Date - Sep 27 , 2026 | 01:35 PM

టాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియాలో హాట్ టాపిక్‌గా మారిన ఒకే ఒక్క ప్రశ్న... రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు తదుపరి ప్రాజెక్ట్ ఎవరితో ఉండబోతోంది?.

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh babu), దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కలయికలో తెరకెక్కుతున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ 'వారణాసి' (Varanasi) బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్స్ తర్వాత జక్కన్న తెరకెక్కిస్తున్న చిత్రంపై ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ గ్లోబ్ ట్రాటింగ్ అడ్వెంచర్ థ్రిల్లర్ ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న విడుదల కానుంది. ఈ సినిమా కోసం మహేష్ బాబు మునుపెన్నడూ లేని విధంగా కనిపించబోతున్నారు. ఇటీవల 'వారణాసి' చిత్రంలో తన పార్ట్ కి సంబంధించిన షూటింగ్‌ను కూడా మహేష్ విజయవంతంగా పూర్తి చేశారట.

అయితే, ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు సౌత్ ఇండియాలో హాట్ టాపిక్‌గా మారిన ఒకే ఒక్క ప్రశ్న... రాజమౌళి సినిమా తర్వాత మహేష్ బాబు తదుపరి ప్రాజెక్ట్ ఎవరితో ఉండబోతోంది?. రాజమౌళి లాంటి విజువల్ వండర్ మేకర్ తర్వాత సినిమా అనగానే, ఆ దర్శకుడు ఎవరనే సస్పెన్స్ అందరిలోనూ పెరిగిపోతుంది. గతంలో మహేష్ తదుపరి చిత్రానికి సంబంధించి పలువురి దర్శకుల పేర్లు గట్టిగానే వినిపించాయి. ​‘ఉప్పెన’తో బ్లాక్‌బస్టర్ కొట్టి.. ఇటీవల 'పెద్ది'తో మంచి విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు సానాతో మహేష్ సినిమా ఉండొచ్చనే టాక్ నడిచింది. మరోవైపు ఎనర్జిటిక్ దర్శకుడు అనిల్ రావిపూడి పేరు కూడా లైన్‌లోకి వచ్చినప్పటికీ, ప్రస్తుతానికి తనకు మహేష్‌తో సినిమా లేదని ఆయనే స్వయంగా స్పష్టత ఇచ్చారు. ఇక ‘యానిమల్’తో సంచలనం సృష్టించిన సందీప్ రెడ్డి వంగా, సలార్ ఫేమ్ ప్రశాంత్ నీల్, అంతెందుకు బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ కూడా మహేష్ కోసం ఒక పీరియాడిక్ కథను వినిపించారంటూ వార్తలు వచ్చాయి.

ఇప్పుడు ఈ రేసులోకి సరికొత్తగా మరో క్రేజీ దర్శకుడి పేరు దూసుకొచ్చింది. ఆయనే కోలీవుడ్ సక్సెస్‌ఫుల్ దర్శకుడు లోకేష్ కనగరాజ్. ​‘మానగరం’తో సినీ ప్రయాణం మొదలుపెట్టి... ‘ఖైదీ’, ‘మాస్టర్’, ‘విక్రమ్’, ‘లియో’, ‘కూలీ’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో తన మార్క్ యాక్షన్ సినిమాటిక్స్ ఏంటో ప్రపంచానికి చూపించారు ఆయన. లోకేష్ సినిమాల్లోని రా అండ్ వింటేజ్ యాక్షన్, పవర్‌ఫుల్ విలనిజం, గూస్‌బంప్స్ ఇచ్చే బీజీఎం ప్రేక్షకులను వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తాయి. ఇప్పుడు ఇదే లోకేష్ కనగరాజ్, సూపర్‌స్టార్ మహేష్ బాబు కోసం ఒక మైండ్ బ్లోయింగ్ యాక్షన్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్‌లో టాక్ వినిపిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ ప్రాజెక్ట్‌ను నిర్మించడానికి సన్నాహాలు చేస్తోందట. లోకేష్ కూడా ఇప్పటికే తన రైటర్స్ టీమ్‌తో కలిసి ఈ కథా చర్చలు జరిపినట్లు సమాచారం.

ఇక ఇటీవల లోకేష్ నటించిన 'DC' సినిమాపై మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపించారు. దీంతో వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఉండే అవకాశం పుష్కలంగా ఉందని అభిమానులు, సినీ వర్గాలు ఆశిస్తున్నాయి. ఒకవేళ లోకేష్ కనగరాజ్ మార్క్ డార్క్ యాక్షన్ డ్రామాలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటిస్తే... థియేటర్లలో రికార్డులు బద్దలవ్వడం ఖాయం. మరి వీరిద్దరి కలయికలో సినిమా వస్తుందా? లేక ఈ వార్తలు కేవలం ఊహాగానాలుగానే మిగిలిపోతాయా? అనేది వేచి చూడాలి.

Updated Date - Sep 27 , 2026 | 01:47 PM