Mahesh: కృష్ణ జయంతి... మహేశ్ ఎమోషనల్ పోస్ట్..
ABN, Publish Date - May 31 , 2026 | 04:33 PM
దివంగత నటుడు కృష్ణ జయంతి (Krishna)సందర్భంగా ఆయన తనయుడు మహేష్ (Mahesh babu)ఎమోషనల్ పోస్ట్ చేశారు.
దివంగత నటుడు కృష్ణ జయంతి (Krishna)సందర్భంగా ఆయన తనయుడు మహేష్ (Mahesh babu)ఎమోషనల్ పోస్ట్ చేశారు. ‘ఎప్పటికీ మీరే నా హీరో. హ్యాపీ బర్త్‌డే డే నాన్నా’ అంటూ తండ్రిపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. మహేశ్ భార్య నమ్రతా శిరోద్కర్ కూడా కృష్ణను స్మరించుకున్నారు. ఎప్పుడూ ప్రేమతో మిమ్మల్ని తలచుకుంటూనే ఉంటామంటూ ఆమె పోస్ట్ చేశారు. నవంబర్ 11, 2022న కృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. ఆదివారం ఆయన జయంతి సందర్భంగా అభిమానులు ఆయన్ను తలచుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అలాగే ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కృష్ణ తనయుడు రమేశ్‌బాబు కుమారుడు జయకృష్ణ హీరోగా పరిచయమవుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రం ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు.
అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా కృష్ణను తలచుకుంటూ ట్వీట్ చేశారు. కృష్ణ సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ‘‘తెలుగు సినీ పరిశ్రమకు నటుచి?గా, దర్శకుడిగా, నిర్మాతగా విశిష్ట విశిష్ఠ సేవలు అందించిన పద్మభూషణ్ కృష్ణ గారి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నా. టాలీవుడ్‌కి కొత్త టెక్నాలజీని పరిచయం చేసిన ఘనత ఆయనది. ఆయన సేవలు చిరస్మరణీయం. ఎప్పటికీ అభిమానుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న ఆయనకు ఘన నివాళి’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.