వారణాసి.. ఆ అరగంట ఫ్యాన్స్ కి పూనకాలే
ABN, Publish Date - Jun 06 , 2026 | 04:38 PM
ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోన్న సినిమాల్లో వారణాసి (Vaaranaasi) ఒకటి. దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో మహేష్ బాబు (Mahesh Babu )హీరోగా నటిస్తోన్న చిత్రం వారణాసి.
ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోన్న సినిమాల్లో వారణాసి (Vaaranaasi) ఒకటి. దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో మహేష్ బాబు (Mahesh Babu )హీరోగా నటిస్తోన్న చిత్రం వారణాసి. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తోండగా.. పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ గా కనిపిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన గ్లింప్స్ ప్రేక్షకుల అంచనాలను మరో రేంజ్ కి తీసుకెళ్ళిపోయింది. అంతేకాకుండా ఇందులో మహేష్ బాబు రాముడిగా కనిపిస్తాడు అని జక్కన్న చెప్పడంతో ఎప్పుడెప్పడు వారణాసి రిలీజ్ అవుతుందా అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తోన్నారు.
ఇక రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ ఆ అంచనాలను మరింత పెంచడంలో ముందు ఉంటారు. వారణాసికి సంబంధించిన స్టోరీని అప్పుడప్పుడు లీక్ చేస్తూ మరింత హైప్ ఇస్తూ ఉంటారు. తాజాగా ఆయన ఒక ఈవెంట్ లో వారణాసి సినిమా గురించి మరో లీక్ చేశారు. ఈ చిత్రంలో రాముడు, కుంభకర్ణుడు మధ్య యుద్ధం చూపించబోతున్నామని, అదే సినిమాకు హైలైట్ అని చెప్పుకొచ్చారు. దీంతో వారణాసి సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.
రామాయణంలో ఇప్పటివరకు రాముడు- రావణుడు మధ్య యుద్దాన్ని చాలామంది చూపించారు. కానీ, మొదటిసారి రాముడు - కుంభకర్ణుడు మధ్య జరిగే మహా యుద్ధాన్ని సినిమాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా చూపించబోతున్నారట. మహేష్ బాబును రాముడి గెటప్‌లో, అది కూడా రాజమౌళి మార్క్ లార్జర్-దన్-లైఫ్ యాక్షన్ సీక్వెన్స్‌లో కుంభకర్ణుడితో పోరాడే విజువల్స్ వెండితెరపై ఎలా ఉంటాయో ఊహించుకుంటేనే అభిమానులకు పూనకాలు వస్తున్నాయి.
లంకలో ఉన్న సీతాదేవిని తీసుకురావడానికి వానర సైన్యంతో వెళ్ళిన రాముడు.. రావణాసురుడి సైన్యం మొత్తాన్ని మట్టికరిపిస్తాడు. అప్పుడు రావణుడు.. తన సోదరుడు అయిన కుంభకర్ణుడిని నిద్రలేపి.. రాముడితో యుద్దానికి పంపుతాడు. మరణం లేని కుంభకర్ణుడితో రాముడు ఎలా యుద్ధం చేశాడు అనేది ఇందులో చూపించారట. ఈ అరగంట ఎపిసోడ్ సినిమాకే హైలైట్‌గా నిలవడమే కాకుండా, ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక విజువల్ వండర్‌గా నిలిచిపోతుందని విజయేంద్ర ప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. మహేష్ బాబును సరికొత్తగా ఆవిష్కరించేందుకు రాజమౌళి హాలీవుడ్ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ వాడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ ఆగలేకపోతోన్నారు. మహేష్ ని రాముడిగా చూడడానికి తహతహలాడుతున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న వారణాసి వచ్చే ఏడాది రిలీజ్ కి సిద్ధమవుతోంది. మరి ఈ సినిమాతో రాజమౌళి ఎలాంటి రికార్డులు సృష్టించబోతున్నాడో చూడాలి.