గౌతమ్ బర్త్‌డేకి మహేష్ బాబు స్పెషల్ మెసేజ్!
ABN, Publish Date - Aug 31 , 2026 | 04:52 PM
సూపర్‌స్టార్ మహేష్ బాబు తన తనయుడు గౌతమ్ ఘట్టమనేని (Gautam Ghattamaneni) 20వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగపూరితమైన పోస్ట్ పంచుకున్నాడు.
సూపర్‌స్టార్ మహేష్ బాబు తన తనయుడు గౌతమ్ ఘట్టమనేని (Gautam Ghattamaneni) 20వ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఒక భావోద్వేగపూరితమైన పోస్ట్ పంచుకున్నాడు. గౌతమ్‌తో కలిసి దిగిన ఒక అందమైన ఫోటోను షేర్ చేస్తూ ఆయన ఎంతో ప్రేమతో జన్మదిన శుభాకాంక్షలు తెలిపాడు. 'హ్యాపీ 20 GG!! నువ్వు ఈ కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా.. నీ కలలను ఎల్లప్పుడూ ధైర్యంతో, దయతో వెంటాడాలని కోరుకుంటున్నాను. ఈరోజే కాదు, ప్రతీ రోజూ నిన్ను చూసి గర్వపడుతూనే ఉంటాను' అంటూ మహేష్ బాబు ఇన్స్టాగ్రామ్‌లో రాసుకొచ్చాడు
ఈ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అభిమానులు, సినీ ప్రముఖులు గౌతమ్‌కి పెద్ద ఎత్తున బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. తండ్రీకొడుకుల బంధం, వారిద్దరి మధ్య ఉన్న పోలికలను చూసి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గౌతమ్ ప్రస్తుతం న్యూయార్క్ యూనివర్సిటీలో డ్రామా విభాగానికి సంబంధించిన ఉన్నత చదువులు అభ్యసిస్తున్న సంగతి తెలిసిందే.త్వరలోనే గౌతమ్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. దీనికోసమే మహేష్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఇక మహేష్ బాబు సినిమాల విషయనికొస్తే.. రాజమౌళి దర్శకత్వంలో వారణాసి సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్నాడు. ఈ సినిమా కోసం ఇండస్ట్రీ మొత్తం వేయికళ్ళతో ఎదురుచూస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. వారణాసి తరువాత మహేష్ ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తాడు అని ఇండస్ట్రీలో కొట్టే డిబేట్ మొదలయ్యింది. అనిల్ రావిపూడితో మరోసారి మహేష్ సినిమా చేస్తున్నదంటూ వార్తలు వచ్చాయి. కానీ, ఆ వార్తలను అనిల్ రావిపూడి ఖండించాడు. మరి వారణాసి సినిమాతో మహేష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడు.. ఆ తరువాత ఏ డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తాడు అనేది చూడాలి.