Gautham Ghattamaneni: మహేష్ వారసుడి టాలీవుడ్ ఎంట్రీ షురూ
ABN, Publish Date - Jan 20 , 2026 | 04:09 PM
టాలీవుడ్ ఇండస్ట్రీ కొత్తదనాన్ని కోరుకుంటుంది. రోజుకో కొత్త హీరో, హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. అలాగే వారితో పాటు స్టార్ హీరోల వారసులు కూడా ఎంట్రీ ఇస్తే కొత్త తరానికి కూడా ఫ్యాన్స్ సంఘాలు ఏర్పడతాయి.
Gautham Ghattamaneni: టాలీవుడ్ ఇండస్ట్రీ కొత్తదనాన్ని కోరుకుంటుంది. రోజుకో కొత్త హీరో, హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయమవుతున్నారు. అలాగే వారితో పాటు స్టార్ హీరోల వారసులు కూడా ఎంట్రీ ఇస్తే కొత్త తరానికి కూడా ఫ్యాన్స్ సంఘాలు ఏర్పడతాయి. ఇక టాలీవుడ్ లో అందరూ ఎదురుచూస్తున్న వారసుల్లో గౌతమ్ ఘట్టమనేని (Gautham Gahattamaneni)ఒకడు. సూపర్ స్టార్ కృష్ణ (Krishna) మనవడిగా.. మహేష్ బాబు (Mahesh Babu) వారసుడిగా ఎప్పుడెప్పుడు గౌతమ్ ఎంట్రీ ఇస్తాడా.. ? అని అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు.
మహేష్ కూతురు సితార గురించి తెలియని సినీ ప్రేక్షకుడు ఉండడు. కానీ, గౌతమ్ గురించి చాలా తక్కువమందికి తెలుసు. గౌతమ్ కన్నా ముందు సితారనే హీరోయిన్గా ఎంట్రీ ఇస్తుందేమో అనే అనుమానాలు కూడా లేకపోలేదు. దానికి మహేష్ క్లారిటీ ఇస్తూ వారసుడు వస్తున్నాడు అని హింట్ ఇచ్చేలా గౌతమ్ జిమ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ కుర్రాడు విదేశాల్లో యాక్టింగ్ కోర్స్ చేస్తున్నాడు.
ఇక గౌతమ్ ని టాలీవుడ్ కి పరిచయం చేయడానికి నిర్మాతలు క్యూలో ఉన్నారు. అశ్వినీదత్, అనిల్ సుంకర, దిల్ రాజు.. ఇలా చెప్పుకుంటూపోతే చాలాపేర్లు ఉన్నాయి. ప్రొడ్యూసర్స్ గురించి దిగులు లేదు అనుకుంటే.. అసలు వారసుడిని పరిచయం చేసే డైరెక్టర్ ఎవరు.. ? కృష్ణ లెగసీని మహేష్ బాబు కొనసాగిస్తున్నాడు. దాన్ని మూడోతరం వారసుడిగా గౌతమ్ ముందుకు తీసుకెళ్లాలి. అతని డెబ్యూ కూడా ఆ రేంజ్ లోనే ఉండాలి. అలా మొదటిసినిమాతోనే గౌతమ్ కి హిట్ ఇచ్చే దర్శకుడు ఎవరు.. ? ఇప్పుడు ఇదే ప్రశ్న అందరి మెదడులో రన్ అవుతుంది.
మహేష్ కొడుకుని పరిచయం చేసే డైరెక్టర్ అదృష్టవంతుడు అని చెప్పొచ్చు. కానీ, ఏదైనా అటు ఇటు జరిగితే మొదట ట్రోల్ అయ్యేది డైరెక్టరే. అందుకే మహేష్ స్టార్ డమ్ ని దృష్టిలో పెట్టుకొని, ఇంకోపక్క గౌతమ్ లుక్ కి, వయస్సుకి తగ్గ కథను ఎంచుకొని.. మంచి స్క్రీన్ ప్లే తో ప్రేక్షకులను ఆకట్టుకోవాలి. అలాంటి డైరెక్టర్ కోసం మహేష్ వెతుకుతున్నట్లు సమాచారం. ఆ డైరెక్టర్ దొరికిన వెంటనే వారసుడి ఎంట్రీ షురూ కానుంది.