రాజమౌళి మైండ్ గేమ్.. మహేష్‌ను ఢీకొట్టే విలన్
ABN , Publish Date - Jun 07 , 2026 | 08:38 PM
సినిమా ఏదైనా.. హీరో ఎవరైనా.. బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వేట మొదలవ్వాలంటే అక్కడ బలమైన శత్రువు ఉండాలి. ఈ సూత్రాన్ని టాలీవుడ్‌లో అత్యంత బలంగా నమ్మే ఏకైక దర్శకుడు.. దర్శకధీరుడు రాజమౌళి. సింహాద్రి నుంచి, బాహుబలి భల్లాళదేవుడి వరకు జక్కన్న సృష్టించిన విలన్లు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో సంచలనాలుగా మారాయో తెలుసు.
సినిమా ఏదైనా.. హీరో ఎవరైనా.. బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వేట మొదలవ్వాలంటే అక్కడ బలమైన శత్రువు ఉండాలి. ఈ సూత్రాన్ని టాలీవుడ్‌లో అత్యంత బలంగా నమ్మే ఏకైక దర్శకుడు.. దర్శకధీరుడు రాజమౌళి. సింహాద్రి నుంచి, బాహుబలి భల్లాళదేవుడి వరకు జక్కన్న సృష్టించిన విలన్లు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్‌లో సంచలనాలుగా మారాయో తెలుసు. శత్రువు పాత్ర ఎంత శక్తిమంతంగా ఉంటే.. కథానాయకుడి పాత్ర అంతగా ఎలివేట్ అవుతుందని రాజమౌళి (Rajamouli) ఎన్నో సందర్భాలలో స్వయంగా చెప్పారు. హీరోల కంటే కూడా ఆయనకు విలన్ల క్యారెక్టరైజేషన్ రాయడమే ఎక్కువ ఇష్టమనే విషయాన్ని చాలా సందర్భాలలో ఓపెన్‌గానే చెప్పారు. మన స్టార్ డైరెక్టర్లు సైతం ఇదే ఫార్ములాను ఫాలో అయి భారీ విజయాలను అందుకున్నారు.
ఇప్పుడు అదే బాటలో మహేష్ బాబుతో జక్కన్న తెరకెక్కిస్తున్న విజువల్ వండర్ వారణాసి లో సైతం ఊహకందని రేంజ్‌లో విలనిజాన్ని డిజైన్ చేశారు. ఈ చిత్రంలో మలయాళ స్టార్ హీరో, విలక్షణ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నారు. ఆయన చేయబోయే కుంభ పాత్ర సినిమాకే హైలైట్ కాబోతోంది. అయితే ఇక్కడే రాజమౌళి ఒక పెను సంచలనానికి తెరతీశారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ పోషించే విలన్ పాత్రకు శరీరంలో ఏ భాగమూ పనిచేయదు. ఆయన పూర్తిగా వీల్‌చైర్‌కే పరిమితమైన ఒక పక్షవాతం వచ్చిన వ్యక్తిగా కనిపించబోతున్నారు. కేవలం కుర్చీకే పరిమితమైన విలన్.. సూపర్ స్టార్ మహేష్ బాబును ఎలా ఢీకొడతాడు..? అసలు యాక్షన్ ఎలా సాధ్యం..? అనే సందేహాలు అందరిలోనూ రావడం సహజం. కానీ, అక్కడున్నది రాజమౌళి, బాడీలో కదలికలు లేకపోయినా.. ఆ విలన్ మెదడు మాత్రం రాకెట్‌కంటే వేగంగా పనిచేస్తుంది. కేవలం తన మైండ్ గేమ్‌తో, వ్యూహాలతో కథానాయకుడిని అతలాకుతలం చేసే భయంకరమైన సైకో విలన్‌గా కుంభ పాత్ర ఉండబోతోంది. శారీరక బలంతో కాకుండా, మేధోశక్తితో మహేష్ బాబును ఎలా ఇరకాటంలో పెడతాడు అనే పాయింట్‌తోనే సినిమా అంతా నడుస్తుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.
ఈ సినిమాలో మహేష్ బాబు రాముడిగా, పృథ్వీరాజ్ కుంభకర్ణుడిగా ఒక ఎపిసోడ్ లో కనిపించబోతున్నారు. ఈ చిత్రంలో రామాయణానికి సంబంధించిన ఒక 30 నిమిషాల సుదీర్ఘ యాక్షన్ ఎపిసోడ్ ఉందట. ఈ అర గంట సీన్ థియేటర్లలో ఆడియెన్స్‌కు నెక్స్ లెవెల్ గూస్‌బంప్స్ తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. మహేష్ బాబు కెరీర్‌లోనే ఇదొక అత్యుత్తమ యాక్షన్ సీక్వెన్స్‌గా నిలిచిపోనుందని టాక్. ఇక లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం, పృథ్వీరాజ్ సుకుమారన్‌కు సంబంధించిన షూటింగ్ పార్ట్ ఇప్పటికే విజయవంతంగా పూర్తయినట్లు తెలుస్తోంది. కొన్ని యాక్షన్ సీన్స్, గ్రాఫిక్స్, ఇతర నిర్మాణానంతర పనులపై జక్కన్న టీమ్ ఫోకస్ పెట్టింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా ఈ 'వారణాసి' చిత్రం భారీ ఎత్తున విడుదల కానుంది. మరి వీల్‌చైర్ విలన్ కుంభను.. రుద్ర పాత్రలో కనిపించబోతున్న మహేష్ బాబు ఎలా ఢీకొట్టబోతున్నాడో చూడాలి.