Mahesh Babu: మహేష్ బాబు - సందీప్ రెడ్డి వంగా మరోసారి వైరల్

ABN , Publish Date - Jun 16 , 2026 | 10:08 AM

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు, దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందని ఎప్పటి నుంచో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. 

సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu), దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా (Sandeep Ranga) కాంబినేషన్‌లో ఓ సినిమా ఉంటుందని ఎప్పటి నుంచో వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి.  ‘యానిమల్’ సినిమా కంటే ముందే మహేష్‌తో సినిమా చేయడానికి ప్రయత్నించారు సందీప్ రెడ్డి వంగా. అయితే అది కార్యరూపం దాల్చలేదు. తదుపరి మహేష్, పరుశురామ్‌తో ‘సర్కారు వారి పాట’ మూవీ చేశాడు. దాంతో ఆ ప్రాజెక్ట్ పక్కకు వెళ్ళింది.  ప్రస్తుతం మహేశ్‌ ‘వారణాసి’ చిత్రంతో, సందీప్‌ రెడ్డి ‘స్పిరిట్‌’ చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల  ఆ వార్తల హడావిడి తగ్గింది. అయితే  ఇప్పుడు మరోసారి మహేశ్‌, సందీప్‌ కాంబో సినిమా గురించి చర్చ మొదలైంది.

ఆల్మోస్ట్‌ వీరిద్దరి  కలయికలో సినిమా ఖరారైందని, ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్‌ను ఏషియన్‌ సినిమాస్‌ పాన్‌ ఇండియా స్థాయిలో నిర్మించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఆ వార్త ఎప్పుడొస్తుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. సందీప్‌ రెడ్డి జానర్‌ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే! ఊర మాస్  స్టైల్‌ అతనిది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వారణాసి చిత్రం పూర్తయిన తర్వాత ఈ చిత్రం మొదలయ్యే అవకాశం ఉంది. 

ALSO READ: సీఎం విజయ్‌తో సిమ్రాన్ ఫ్యామిలీ.. ఫొటోస్ వైరల్!

మొన్న పవన్.. ఇప్పుడు ఎన్టీఆర్.. ‘సింగ్ గీతం’పై ప్రశంసలు



Updated Date - Jun 16 , 2026 | 10:47 AM