సీఎం విజయ్‌తో సిమ్రాన్ ఫ్యామిలీ.. ఫొటోస్ వైరల్!

ABN , Publish Date - Jun 16 , 2026 | 12:35 AM

తమిళనాడు రాష్ట్రానికి సీఎం‌గా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి దళపతి విజయ్ తన మార్క్‌ను స్పష్టంగా ప్రదర్శిస్తున్నారు. ఆయన చేసే ప్రతి పని, తీసుకునే ప్రతి నిర్ణయం సంచలనంగా మారుతోంది.

Simran Family with CM Vijay

తమిళనాడు రాష్ట్రానికి సీఎం‌గా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి దళపతి విజయ్ (Tamil Nadu CM Vijay) తన మార్క్‌ను స్పష్టంగా ప్రదర్శిస్తున్నారు. ఆయన చేసే ప్రతి పని, తీసుకునే ప్రతి నిర్ణయం సంచలనంగా మారుతోంది. అసలు విజయ్ ఎలా ఆ పదవిని మోస్తాడో అని అనుకున్నవారంతా ఆశ్చర్యపోయేలా.. ప్రతి రోజూ ఏదో ఒక స్పెషల్‌ సర్‌ప్రైజ్‌ని అందరికీ ఇస్తున్నారు. ఈ క్రమంలో ఆయనని కలిసి అభినందించే వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలో తన సహనటి సిమ్రాన్.. తన ఫ్యామిలీతో సహా వెళ్లి సీఎం విజయ్‌ని కలిసి అభినందించారు. సీఎం విజయ్‌ని కలిసిన ఫొటోలను షేర్ చేస్తూ.. నటి సిమ్రాన్ (Simran) ఆయనపై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆమె షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.


‘‘చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ కలిసి స్క్రీన్ స్పేస్‌ను పంచుకున్న అపరూప క్షణాల అనంతరం, గౌరవనీయ ముఖ్యమంత్రి విజయ్ గారిని నా కుటుంబంతో (Simran Family Pic) కలిసి కలవడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. ఎంతో మందికి ఆయనను దగ్గర చేసిన ఆ ఆప్యాయత, వినయం, నిజాయితీ ఇప్పటికీ అలాగే ఉన్నాయి. మన రాష్ట్ర ప్రగతి కోసం ఆయనకున్న తపన, విజన్ ఎంతో స్ఫూర్తిదాయకం. తమిళనాడును విజయపథంలో ముందుకు నడిపిస్తున్న ఆయనకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు’’ అని సిమ్రాన్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ పోస్ట్‌తో పాటు ఆమె షేర్ చేసిన ఫొటోలలో ఫస్ట్ టైమ్ సిమ్రాన్ తన ఫ్యామిలీ మొత్తాన్ని సోషల్ మీడియాకు పరిచయం చేసినట్లయింది.


ఇక ఈ ఫొటోలను చూసిన వారంతా.. సిమ్రాన్‌కు ఇంత పెద్ద కుమారులు (Simran Sons) ఉన్నారా? అంటూ ఆశ్చర్యపోతున్నారు. అవును, సీఎం విజయ్ పక్కనే ఉన్న ఇద్దరు కుర్రాళ్లు సిమ్రాన్ కుమారులని తెలిసి.. నెటిజన్లంతా ఇదే ప్రశ్నని సంధిస్తున్నారు. నిజంగానే అసలు నమ్మలేని విధంగా అంత పెద్ద కుమారులు సిమ్రాన్‌కు ఉన్నారా? అని అనిపిస్తోంది. ఏదిఏమైనా, సీఎం విజయ్‌ని కలిసే క్రమంలో సిమ్రాన్ తన కుమారులను పరిచయం చేయడంతో.. వీరిలో ఎవరు ఇండస్ట్రీలోకి అడుగు పెడతారో అని అంతా కామెంట్స్ చేస్తుండటం విశేషం. ఇక సిమ్రాన్ విషయానికి వస్తే.. ఒకప్పటి గ్లామర్ క్వీన్ సిమ్రాన్ ఇప్పటికీ అంతే ఫిట్‌గా, యంగ్‌గా కనిపిస్తుండటంతో.. పక్కన ఉన్న కుమారులు ఆమెకు తమ్ముళ్లలా ఉన్నారనేలా క్రేజీ కామెంట్స్ పడుతుండటం విశేషం. ఈ కామెంట్స్‌తో సిమ్రాన్ పోస్ట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.

ఇవి కూడా చదవండి:

మెగా రికార్డ్.. ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఫస్ట్ టైమ్!

సాయి పల్లవి అనుకున్నప్పుడు ఆ సీన్స్ లేవు: ‘మా ఇంటి బంగారం’ టీమ్‌తో చిట్ చాట్

ఎయిర్ పోర్ట్‌లో వడ్డే నవీన్ పరపతి చూసి షాకయ్యా: వివి వినాయక్

Updated Date - Jun 16 , 2026 | 12:35 AM