సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

R Madhavan: కరోనా సమయంలో జరిగిన సరదా సంఘటన..

ABN, Publish Date - Feb 05 , 2026 | 05:36 PM

తమిళ నటుడు మాధవన్‌ కరోనా సమయంలో జరిగిన ఓ విషయాన్ని సరదాగా గుర్తు చేసుకున్నారు.


తమిళ నటుడు మాధవన్‌ (R Madhavan) కరోనా సమయంలో జరిగిన ఓ విషయాన్ని సరదాగా గుర్తు చేసుకున్నారు.  కరోనా, లాక్‌డౌన్‌ సమయంలో తాను ఇంట్లోనే ఉండడం చూసి భార్య సరిత (Saritha) ఇంట్లో నుంచి బయటకు గెంటేసిందని ఆయన తెలిపారు. తాజాగా నేషనల్‌ మీడియాకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో మాధవన్‌ ఈ విషయాన్ని చెప్పారు. ‘కొవిడ్‌ సమయంలో ఇంట్లో ఖాళీగా ఉన్నాను. అప్పుడు నా భార్య వచ్చి.. ‘నువ్వు ఇలా ఖాళీగా ఉండడం ఎప్పుడూ చూడలేదు. ఏదో వర్క్‌ చేస్తూనే ఉంటావు. కామెడీ, యాక్షన్‌ సినిమాలు, ఓటీటీ ఏదో ఒక ప్రాజెక్ట్‌తో నటిస్తూనే ఉంటావు.

ఇప్పుడు ఇంట్లోనే ఉంటున్నావంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. గతంలో ఉన్నంత ఉత్సాహంగా కనిపించడం లేదు. వర్క్‌కు వెళ్లినా త్వరగా ఇంటికి వచ్చేస్తున్నావు. నువ్వు బాగానే ఉన్నావా. ఎప్పటిలానే బయటకు వెళ్లి, డబ్బులు సంపాదించు’ అని చెప్పింది. ఆ మాటలు  నాలో ఆలోచనను కలిగించాయి’ అని మాధవన్‌ అన్నారు. అయితే ఈ విషయాన్ని ఆయన సరదాగా వెల్లడించారు. కొవిడ్‌ సమయంలో నా భార్య డబ్బు సంపాదించమని బయటకు గెంటేసింది అని చెప్పడంతో ఈ కామెంట్స్‌ వైరల్‌ అయ్యాయి.
 


 

Updated Date - Feb 05 , 2026 | 05:38 PM