సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మ్యాడ్ హీరో.. కొత్త సినిమా షురూ

ABN, Publish Date - Jun 05 , 2026 | 07:38 AM

‘మ్యాడ్’ హీరో రామ్ నితిన్ కొత్త సినిమా ప్రకటించారు. కాకినాడ కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌కు వెంకటేశ్ నిమ్మలపూడి దర్శకత్వం వహిస్తున్నారు.

Ram Nithin

‘మ్యాడ్‌’ చిత్రంతో యువ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్న హీరో రామ్‌ నితిన్ (Ram Nithin) మరో యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నారు. కాకినాడలోని ఓ కాలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఇది తెరకెక్కనుంది.

‘సుందరకాండ’ ఫేమ్‌ వెంకటేశ్‌ నిమ్మలపూడి (Venkatesh Nimmalapudi) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వల్లభనేని గిరిబాబు సమర్పణలో ధీరజ్‌ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ధీరజ్‌ మొగిలినేని నిర్మిస్తున్నారు.

గురువారం రామ్‌ నితిన్‌ పుట్టినరోజును పురస్కరించుకుని ఈ సినిమాకు సంబంధించిన స్పెషల్‌ పోస్టర్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేశారు. కలర్‌ఫుల్‌ కాలేజ్‌ ఫెస్ట్‌ వైబ్స్‌తో పోస్టర్‌ ఆకట్టుకుంటోంది. ‘ఫన్‌, ఫెస్ట్‌, కెయాస్‌... బిగిన్స్‌ సూన్‌’ అంటూ పోస్టర్‌లో పెట్టిన క్యాప్షన్‌ ఈ సినిమా మంచి వినోదాత్మకంగా ఉండబోతోందని తెలియజేస్తోంది.

Updated Date - Jun 05 , 2026 | 07:38 AM