సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Pavala Syamala:  వృద్ధాశ్రమానికి పార్థివదేహం... బుధవారం అంత్యక్రియలు

ABN, Publish Date - Jul 28 , 2026 | 02:31 PM

పావలా శ్యామల అంత్యక్రియలకు సంబంధించిన పూర్తి బాధ్యతలను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) స్వీకరించినట్లు నటి కరాటే కళ్యాణి వెల్లడించారు.

సినీ నటి పావలా శ్యామల (Pavala Syamala) మృతితో తెలుగు సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. ఆమె పార్థివదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి నుంచి వనస్థలిపురంలో సామాజిక కార్యకర్త శంకర్ నిర్వహిస్తున్న'రెడీ టూ సర్వ్ ఫౌండేషన్' వృద్ధాశ్రమానికి తరలించారు. అక్కడ ఆమెకు సినీ ప్రముఖులు, అభిమానులు నివాళులర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. పావలా శ్యామల అంత్యక్రియలకు సంబంధించిన పూర్తి బాధ్యతలను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) స్వీకరించినట్లు నటి కరాటే కళ్యాణి వెల్లడించారు. సినీ కళాకారిణిగా ఆమె అందించిన సేవలకు గాను 'మా' ఆధ్వర్యంలో అంత్యక్రియలను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటలకు ఫిల్మ్‌నగర్ మహాప్రస్థానంలో అంతయక్రియలు  నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై ఆమెకు తుది వీడ్కోలు పలికే అవకాశం ఉంది.

దశాబ్దాలుగా తెలుగు సినిమాల్లో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన పావలా శ్యామల ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ఇటీవల ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో ఆమె వార్తల్లో నిలిచినా, చివరి వరకు ధైర్యంగా జీవించారు. ఆమె మరణం తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jul 28 , 2026 | 03:17 PM