సమంత.. మళ్ళీ ఆ తప్పు చేయదు కదా
ABN, Publish Date - May 13 , 2026 | 07:14 PM
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) హీరోయిన్ గా నందినిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మా ఇంటి బంగారం (Maa Inti Bangaram). ట్రాలాల పిక్చర్స్ బ్యానర్ పై సామ్ భర్త రాజ్ నిడిమోరు (Raj Nidimoru) ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) హీరోయిన్ గా నందినిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం మా ఇంటి బంగారం (Maa Inti Bangaram). ట్రాలాల పిక్చర్స్ బ్యానర్ పై సామ్ భర్త రాజ్ నిడిమోరు (Raj Nidimoru) ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అన్ని బావుండి ఉంటే మే 15 న బంగారం ప్రేక్షకుల ముందుకు వచ్చేది. కానీ, కొన్ని అనివార్య కారణాల వలన బంగారం వాయిదా పడింది.
ఆ కారణాలు ఏంటి అంటే.. మొదటి నుంచి బంగారం ప్రమోషన్స్ పై సామ్ దృష్టి పెట్టలేదు. చేసిన రెండు ఇంటర్వ్యూలకు బజ్ రాలేదు. సామ్ పెళ్ళి తరువాత నటించిన మొదటి సినిమా కావడంతో ఫ్యాన్స్ చాలా అంచనాలను పెట్టుకున్నారు. కానీ ఆ అంచనాలను సామ్ అందుకోలేకపోయింది. ఇక మరో కారణం.. ఐపీఎల్ కారణంగా సినిమాకు ప్రేక్షకులు రారు అని వాయిదా వేయాలని నిర్ణయించుకున్నారు. ఇక ముందు నుంచి చెప్తున్నట్లుగానే బంగారం వాయిదా పడింది. మే నుంచి జూన్ కి షిఫ్ట్ అయ్యింది. తాజాగా సామ్.. మా ఇంటి బంగారం కొత్త రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించింది. జూన్ 19 న బంగారం రిలీజ్ కానుందని తెలిపింది.
జూన్ 4 పెద్దితో సమ్మర్ ముగుస్తోంది. జూన్ 26 న అయ్యగారు లెనిన్ తో వస్తున్నాడు. మొదలు, చివర కాకుండా.. వాళ్ళతో పోటీ లేకుండా నెల మధ్యలో జూన్ 19 న బంగారం రావడానికి సిద్ధమైంది. ఈ లెక్కన ప్రమోషన్స్ చేయడానికి సామ్ కి ఇంకా నెల సమయం ఉంది. ఈ నెలలో సినిమాపై ఎంత బజ్ రావాలో.. అంత రప్పించాలి. లేకపోతే సినిమా వాయిదా వేసి కూడా ప్రయోజనం ఉండదు. మరి మొన్న చేసిన తప్పు చేయకుండా సామ్ ప్రమోషన్స్ ని ఏ విధంగా చేస్తుందో.. బజ్ ఎలా క్రియేట్ చేస్తుందో చూడాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే.