'మా' అసోసియేషన్ కు డిప్యూటీ సీఎం అభినందనలు
ABN, Publish Date - Feb 23 , 2026 | 06:03 PM
‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్) నూతన సంవత్సరం డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆవిష్కరించారు.
‘మా’ (మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ) నూతన సంవత్సరం డైరీని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. 'మా' సభ్యుల కోసం చేపడుతున్న ఆరోగ్య అవగాహన, హెల్త్ చెకప్ క్యాంపులు, సభ్యుల సంక్షేమం కోసం 'మా' కార్యవర్గం చేపడుతున్న కార్యక్రమాల గురించి అధ్యక్షుడు విష్ణు మంచు, ఈసీ మెంబర్స్ డిప్యూటీ సీఎంకు వివరించారు. అసోసియేషన్ చేస్తున్న కార్యక్రమాలను గురించి తెలుసుకున్న భట్టి విక్రమార్క, మంచు విష్ణు బృందాన్ని అభినందించారు.
సోమవారం ఉదయం ప్రజాభవన్ లో జరిగిన ఈ కార్యక్రమంలో ‘మా’ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, ట్రెజరర్ శివ బాలాజీతో పాటుగా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ జయవాణి, మలక్ పేట్ శైలజ, శివ నారాయణ, శశాంక్, హరనాథ్ బాబు, మాణిక్ సంపూర్ణేశ్ బాబు, ఎం.ఆర్.సి. వడ్లపట్ల తదితరులు పాల్గొన్నారు.