Love Virus: 'లవ్ వైరస్' షార్ట్ ఫిల్మ్ కు విశేష ఆదరణ.. ఏబీయన్ యాజమాన్యం అభినందనలు
ABN, Publish Date - May 19 , 2026 | 06:07 PM
జర్నలిస్ట్ సయ్యద్, నుమాన్ దర్శకత్వంలో అరమాస ప్రవీణ్ నిర్మాతగా రూపొందించిన 'లవ్ వైరస్' షార్ట్ ఫిలింను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ వీక్షించారు.
జర్నలిస్ట్ సయ్యద్, నుమాన్ దర్శకత్వంలో అరమాస ప్రవీణ్ నిర్మాతగా రూపొందించిన 'లవ్ వైరస్' షార్ట్ ఫిలింను ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ వీక్షించారు. ఈ సందర్భంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ, ఏబీఎన్ డైరెక్టర్ భాను ప్రకాష్ కోగంటి చిత్ర యూనిట్ సభ్యులను అభినందించారు. గంట నిడివి గల చిత్రాన్ని ప్రయోగాత్మకంగా 48 గంటల్లో చిత్రీకరణ పూర్తి చేయడం గొప్ప విషయం అన్నారు.
మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన కొంత మంది యువకులు చేసిన 'లవ్ వైరస్' షార్ట్ ఫిల్మ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.. భాను ప్రకాశ్, హసీనా జంటగా ఎస్.డి. నుమాన్ తెరకెక్కించారు. నేటి యువతలో రెగ్యులర్ గా కనిపించే ఓ పాయింట్ ను అద్భుతంగా చూపించాడు డైరెక్టర్ నుమాన్. డైరెక్టర్ సయ్యదు నుమాన్ విజన్‌ను నమ్మిన ప్రొడ్యూసర్ అరమాస ప్రవీణ్ ఈ షార్ట్ ఫిల్మ్‌ని పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కించారు. కేవలం 60 వేల పెట్టుబడితో హైదరాబాద్ పరిసరాల్లో రెండ్రోజుల్లోనే చిత్రీకరణ పూర్తి చేసుకున్నారు. ఇందులో నటించిన వారితో పాటు డైరెక్టర్, ప్రొడ్యూసర్ సహా టీమ్ మొత్తం ఏబీఎన్ లోనే వర్క్ చేస్తున్నారు. నుమాన్, ప్రవీణ్ రిపోర్టర్లుగా బాధ్యతలు నిర్వహిస్తుంటే... భాను ప్రకాశ్ వీడియో ఎడిటర్‌గా పని చేస్తున్నారు. భాను ప్రకాశ్ కేవలం నటించడమే కాదు...ఈ షార్ట్ ఫిల్మ్ ను ఎడిట్ చేశాడు.
మౌత్ టాక్ తో దూసుకుపోతున్న ఈ వెబ్ సిరీస్ ను ఆంధ్రజ్యోతి యాజమాన్యం సైతం మెచ్చుకోవడం వీరి ప్రతిభకు మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది. మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణతో పాటు డైరెక్టర్ భాను ప్రకాష్ కోగంటి ఈ వెబ్ సిరీస్‌లో నటించిన నటీనటులను, టెక్నికల్ టీమ్ ను పిలిపించుకొని అభినందించారు. ఈ వెబ్ సిరీస్ కోసం కష్టపడ్డ తీరును అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి మంచి మంచి కంటెంట్ తో మరిన్ని షార్ట్ ఫిల్మ్స్ చేయాలని 'ఆల్ ది బెస్ట్' తెలిపారు. తక్కువ బడ్జెట్ తో షార్ట్ ఫిల్మ్ తీసి మరికొందరికి ఆదర్శంగా నిలిచారని కితాబిచ్చారు.
ఇదిలా ఉంటే ఇది షార్ట్ ఫిలిం అయినప్పటికీ పెద్ద చిత్రాలకు దీటుగా షూటింగ్ మొదటి రోజు నుంచి టీమ్ తమదైన శైలిలో ప్రచారం చేస్తూ అందరిని ఆకట్టుకున్నారు. అందులో భాగంగా మాజీ మంత్రి మల్లారెడ్డి ఫస్ట్ లుక్ విడుదల చేయగా, హైదరాబాద్ సిపి సజ్జనార్ చేతుల మీదుగా పాటను చిత్ర యూనిట్ సభ్యులు విడుదల చేయించారు.