సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

LGBT A Legal Battle: గ్రాడియంటే ఇన్ఫోటైన్‌మెంట్‌తో చేతులు కలిపిన శ్రావ్య ఫిలిమ్స్

ABN, Publish Date - Jun 26 , 2026 | 02:00 PM

సునీల్‌ కుమార్ రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన 'ఎల్.జి.బి.టి. ఏ లీగల్ బ్యాటిల్' మూవీ రెండోవారంలోకి అడుగుపెట్టింది. ఈ సినిమాను ఇతర భారతీయ భాషల్లో అనువదించేందుకు గ్రాండియంటే ఇన్ఫోటైన్ మెంట్‌ లిమిటెడ్‌ ముందుకు వచ్చింది.

LGBT: A Legal Battle

ఉత్తమ చిత్రాల అవార్డు గ్రహీత, సామాజిక అంశాలపై తనదైన ముద్ర వేసిన దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కించిన ‘ఎల్‌జీబీటీ: ఏ లీగల్ బ్యాటిల్’ చిత్రం ఇప్పుడు దేశవ్యాప్తంగా మరింత విస్తృత ప్రేక్షకాదరణ పొందేందుకు సిద్ధమవుతోంది. జూన్ 19న ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో దేశవ్యాప్తంగా విడుదలైన ఈ తెలుగు చిత్రం ప్రేక్షకులు, విమర్శకులు, ఎల్‌జీబీటీ కమ్యూనిటీ నుంచి విశేష ప్రశంసలు అందుకుంది. ప్రస్తుతం విజయవంతంగా రెండో వారంలోకి అడుగుపెట్టింది. ఇదిలా ఉంటే... ఈ చిత్రాన్ని పలు భారతీయ భాషల్లో డబ్ చేసి విడుదల చేయడానికి గ్రాడియంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్ ముందుకు వచ్చింది.


ఈ సందర్భంగా గ్రాడియంటే ఇన్ఫోటైన్‌మెంట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ విమల్ రాజ్ మాథుర్ మాట్లాడుతూ, 'సమాజానికి అవసరమైన సందేశాన్ని అందించే చిత్రాన్ని రూపొందించిన శ్రావ్య ఫిల్మ్స్‌తో భాగస్వామ్యం కావడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. ఎల్‌జీబీటీ: ఏ లీగల్ బ్యాటిల్ ప్రాంతీయ చిత్రంగా కాకుండా దేశవ్యాప్తంగా, అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకునే శక్తి కలిగిన సినిమా అని మేం విశ్వసిస్తున్నాం' అని అన్నారు. ఈ భాగస్వామ్యానికి ప్రధాన కారకులైన ప్రముఖ వ్యాపారవేత్త, టీపీఎల్‌ ఛైర్మన్ రాజేష్ అగర్వాల్ మాట్లాడుతూ, 'మంచి సినిమాలకు సరైన వేదిక దొరికితే అవి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను చేరుకోగలవు. పి. సునీల్ కుమార్ రెడ్డి గారి సృజనాత్మక దృష్టి, గ్రాడియంటే ఇన్ఫోటైన్‌మెంట్ మార్కెటింగ్ సామర్థ్యం కలిస్తే ఈ సినిమా మరింత విశాలమైన ప్రేక్షకులకు చేరుతుంది. ఈ భాగస్వామ్యం భవిష్యత్తులో మరిన్ని విలువైన, సామాజిక బాధ్యత కలిగిన చిత్రాలకు మార్గం సుగమం చేస్తుందని నమ్ముతున్నాను' అని అన్నారు. మీడియా కన్సల్టెంట్ సందీప్ జైన్ మాట్లాడుతూ, 'ఎల్‌జీబీటీ: ఏ లీగల్ బ్యాటిల్ ఒక ప్రాంతీయ కథ మాత్రమే కాదు. భారత ఉపఖండ సమాజంలో నిశ్శబ్దంగా మిగిలిపోయిన అనేక జీవితాల కథ. ఇలాంటి నిజాయితీతో కూడిన చిత్రాలు భాషల సరిహద్దులు దాటి ప్రపంచ ప్రేక్షకులను కూడా ఆలోచింపజేసే శక్తిని కలిగి ఉంటాయి' అని చెప్పారు.


ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు, నిర్మాణ సంస్థ శ్రావ్య ఫిల్మ్స్ మేనేజింగ్ డైరెక్టర్ పి. సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, 'గ్రాడియంటే ఇన్ఫోటైన్‌మెంట్ లాంటి ప్రముఖ సంస్థతో కలిసి పనిచేసే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉంది. వారి అనుభవం, మార్కెటింగ్ నెట్‌వర్క్ ఈ చిత్రాన్ని మరింత విస్తృత స్థాయికి జనం ముందుకు తీసుకెళ్తుందని నమ్ముతున్నాను' అని అన్నారు. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ, 'నిజాయితీగా చెప్పిన కథలకు భాషా, భౌగోళిక సరిహద్దులు ఉండవు. మంచి కథ ఎక్కడైనా ప్రేక్షకుల మనసును తాకుతుంది. ఈ భాగస్వామ్యం మా రెండు సంస్థల మధ్య దీర్ఘకాలిక అనుబంధానికి నాంది కావాలని, భవిష్యత్తులో మరిన్ని అర్థవంతమైన, ప్రపంచ స్థాయి చిత్రాలను కలిసి నిర్మించే అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను' అని అన్నారు. త్వరలోనే ఇతర భారతీయ భాషల్లో డబ్బింగ్‌ కార్యక్రమాలు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. 'ఎల్.జి.బి.టి. ఏ లీగల్ బ్యాటిల్‌' మూవీలో ఎల్ బి శ్రీరామ్ , ఎస్తర్ నోరోన్హా , రాజు ఖేర్, ఆనంద చక్రపాణి, ప్రీతి నిగమ్, విష్ణు తేజ, హిమ రాథోడ్, సనా ఖాన్, లైలా ఓరుగంటి చంద్రముఖి తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బి. బాపిరాజు కాగా సహ నిర్మాతగా సుభాష్‌ చక్రవర్తి రావాడ వ్యవహరించారు.

ఇవి కూడా చదవండి:

Bhagyashri Borse: భాగ్య‌శ్రీ.. సైలెంట్‌గా సౌత్‌ను దున్నేస్తుందిగా!

Demonte Colony 3:‘డిమాంటి కాలనీ-3’.. రిలీజ్ డేట్ వ‌చ్చేసింది


Naveen Polishetty: పాన్‌ ఇండియా దర్శకులతో కాస్ట్‌లీ ఫ్రేమ్‌..



Updated Date - Jun 26 , 2026 | 02:18 PM