సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘లెనిన్’ 3 డేస్ కలెక్షన్స్.. అయ్యగారు ఫిఫ్టీ ప్లస్ నాటౌట్.. ఇక సెంచరీనే!

ABN, Publish Date - Jul 13 , 2026 | 04:45 PM

అక్కినేని యువ హీరో అఖిల్ నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్’ బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి వీకెండ్‌లోనే బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది.

Lenin Movie Poster

అక్కినేని యువ హీరో అఖిల్ (Akhil Akkineni) నటించిన మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘లెనిన్’ (Lenin) బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటను కొనసాగిస్తోంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి వీకెండ్‌లోనే బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటింది. నెగెటివ్స్ అన్నింటినీ పటాపంచలు చేస్తూ, ప్రేక్షకుల నుంచి వస్తోన్న అద్భుతమైన రెస్పాన్స్‌తో ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. చిత్రయూనిట్ అధికారికంగా విడుదల చేసిన సరికొత్త పోస్టర్ ప్రకారం.. ‘లెనిన్’ చిత్రం కేవలం 3 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 61.1 కోట్ల గ్రాస్ వసూళ్లను (Lenin 3 Days Collections) సాధించి సరికొత్త మైలురాయిని అందుకుంది.


తాజాగా విడుదల చేసిన పోస్టర్‌లో అఖిల్ అక్కినేని, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే రొమాంటిక్ లుక్‌లో కనిపిస్తుండగా, బ్యాక్‌గ్రౌండ్‌లో ‘మనోడు బ్లాక్‌బస్టర్ కొట్టేశాడు’ అనే క్యాప్షన్ అభిమానుల్లో జోష్ నింపుతోంది. మొదటి రెండు రోజుల్లోనే మంచి ఓపెనింగ్స్ రాబట్టిన ఈ చిత్రం, ఆదివారం (మూడో రోజు) నాటికి రూ. 50 కోట్ల క్లబ్‌ను దాటేసి ‘ఫిఫ్టీ ప్లస్’ మార్కుతో నాటౌట్‌గా దూసుకుపోతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన థియేటర్లలో ఆదివారం రికార్డు స్థాయి అక్యుపెన్సీ నమోదు కావడంతో ఈ స్థాయి వసూళ్లు సాధ్యమయ్యాయని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.


మొదటి వీకెండ్‌లోనే రూ. 61.1 కోట్ల మార్కును అందుకోవడంతో, ఈ సినిమా లాంగ్ రన్‌లో ఈజీగా రూ. 100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టడం ఖాయమని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అఖిల్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘లెనిన్’.. బాక్సాఫీస్ వద్ద త్వరలోనే ‘సెంచరీ’ మార్కును కూడా దాటేసేలా కనిపిస్తోంది. ఇప్పటి వరకు క్రికెట్ గ్రౌండ్‌లోనే సక్సెస్ అయిన అయ్యగారు.. ఈసారి బాక్సాఫీస్ వద్ద కూడా తన సత్తా చాటుతున్నాడంటూ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి థమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, అఖిల్ సరికొత్త రగ్గడ్ లుక్ థియేటర్లలో ఆడియన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తుండటంతో.. సెకండ్ వీకెండ్‌కు ఈ సినిమా మరిన్ని రికార్డులు క్రియేట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి:

‘జురాసిక్ పార్క్’ డాక్టర్ అలన్ గ్రాంట్ కన్నుమూత

‘వారణాసి’లో చిన్నప్పటి మహేష్‌గా అభయ్ రామ్.. స్క్రీన్స్ ఉంటాయా!

హాలీవుడ్ దర్శకుడిని ఆకర్షించిన మహేష్ తనయుడు.. ఏం జరుగుతోంది

Updated Date - Jul 13 , 2026 | 04:51 PM