సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

బ్రేకింగ్.. గాన కోకిల ఎస్. జానకమ్మ కన్నుమూత

ABN, Publish Date - Jul 11 , 2026 | 08:19 PM

భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. తన మధురమైన గాత్రంతో కొన్ని దశాబ్దాల పాటు కోట్ల మంది ప్రేక్షకులను మైమరపించిన లెజెండరీ సింగర్, గానకోకిల ఎస్. జానకి(S. Janaki) ఇకలేరు.

S. Janaki

భారతీయ సినీ సంగీత ప్రపంచంలో ఒక సువర్ణ అధ్యాయం ముగిసింది. తన మధురమైన గాత్రంతో కొన్ని దశాబ్దాల పాటు కోట్ల మంది ప్రేక్షకులను మైమరపించిన లెజెండరీ సింగర్, గానకోకిల ఎస్. జానకి(88)(S.Janaki) ఇకలేరు. కొద్దిసేపటి క్రితమే మైసూర్ లో ఆమె మరణించారు. ఈ విషయాన్ని జానకి మనవరాలు అప్సర వైద్యుల సోషల్ మీడియా వేదికగా తెలిపారు. దీంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.


'నా ప్రియమైన అమ్మమ్మ, లెజెండరీ సింగర్ శ్రీమతి ఎస్. జానకి గారు కన్నుమూశారని తీవ్ర విచారంతో పంచుకుంటున్నాను. కుటుంబ సభ్యుల ప్రేమ మధ్య ఆమె ప్రశాంతంగా చివరి శ్వాస విడిచారు. ప్రస్తుతం మా హృదయాలు భారంగా ఉన్నప్పటికీ.. ఆమె జీవించిన అసాధారణమైన జీవితానికి, తన అమర సంగీతం ద్వారా కోట్ల మందికి అందించిన అపరిమితమైన ఆనందానికి మేము ఎంతో కృతజ్ఞతతో ఉన్నాము. ప్రపంచానికి ఆమె ఎన్నో జ్ఞాపకాలలో భాగమైన ఒక ఐకానిక్ వాయిస్ కావచ్చు, కానీ మాకు మాత్రం ఎంతో ఆప్యాయత, వినయం, దయ, హుందాతనం కలిగిన ఒక ప్రియమైన అమ్మమ్మ. ఆమె జ్ఞాపకాలు ఎప్పటికీ మాతోనే ఉంటాయి. మేము ఈ పెద్ద లోటును తట్టుకుని, తీవ్ర బాధలో ఉన్న ఈ కష్టసమయంలో మా కుటుంబానికి కావలసిన ప్రైవసీని గౌరవించాలని అందరినీ కోరుతున్నాను. మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు' అంటూ తెలిపారు.


ఇక ఈ వార్త విన్న సినీ పరిశ్రమ, సంగీత అభిమానులు ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. జానకి మరణంతో టాలీవుడ్‌తో పాటు మొత్తం దక్షిణ భారత సినీ పరిశ్రమలో ఒక శకం ముగిసినట్లయింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ నెటిజన్లు, సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Jul 11 , 2026 | 08:33 PM