పొలిటికల్ డ్రామాతో అయినా హిట్ సాధ్యపడుతుందా?
ABN, Publish Date - Sep 06 , 2026 | 10:34 AM
విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘లెగసీ’ విడుదల తేదీ ఖరారైంది.
విశ్వక్ సేన్ (Vishwak sen) కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘లెగసీ’ (Legacy) విడుదల తేదీ ఖరారైంది. ఇంటెన్స్ పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. సాయికిరణ్ రెడ్డి దైదా (Sai Kiran Reddy Daida) దర్శకత్వంలో కలాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి, సాయి కిరణ్ రెడ్డి దైదా నిర్మిస్తున్నారు. సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ మేకర్స్ ఓ స్ట్రైకింగ్ పోస్టర్‌ను విడుదల చేశారు. విశ్వక్ సేన్, ఏక్తా రాథోడ్ కనిపిస్తున్న ఈ కొత్త పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ‘పిండం’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన సాయికిరణ్ రెడ్డి దైదా, ‘లెగసీ’తో తన రెండో ఫీచర్ ఫిల్మ్‌ను తెరకెక్కిస్తున్నారు.
పవర్‌ఫుల్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ‘లెగసీ’లో ఫ్యామిలీ, ప్రేమ, అధికారం, ద్రోహం, వంటి అంశాల మధ్య జరిగే ఆసక్తికర సంఘర్షణను ఆవిష్కరించనున్నారు. తన తండ్రి వదిలిన వారసత్వం కారణంగా ప్రమాదకరమైన ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఓ యువకుడి ప్రయాణంలో విశ్వక్ సేన్ పాత్ర సాగుతుంది. హిందీ నటుడు కే కే మీనన్ అత్యంత శక్తివంతమైన ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది.