Kajal: నో చెప్పడం అలవాటు చేసుకోవాలి..

ABN , Publish Date - Jul 05 , 2026 | 03:38 PM

కొన్ని సందర్భాల్లో మన ఆత్మగౌరవాన్ని చంపుకోకుండా సినిమా ఇండస్ట్రీలో ముందుకెళ్లాలంటే ‘నో’ చెప్పడం అలవాటు చేసుకోవడం ఉంతో ముఖ్యం.

‘కొన్ని సందర్భాల్లో మన ఆత్మగౌరవాన్ని చంపుకోకుండా సినిమా ఇండస్ట్రీలో ముందుకెళ్లాలంటే ‘నో’ చెప్పడం అలవాటు చేసుకోవడం ఉంతో ముఖ్యం. అన్ని సందర్భాల్లోనూ అవును అని చెప్పాల్సిన పనిలేదు. మన ముందు ఉన్న పరిస్థితుల్ని బట్టి నిర్ణయాలు తీసుకునే విధానం మారుతుంటుంది’ అని అన్నారు కాజల్‌ అగర్వాల్‌ (Kajal) . త్వరలో ‘ది ఇండియా స్టోరీ’ (The India story) సినిమాతో అలరించడానికి సిద్ధమవుతుంది. తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు.

‘కొన్ని సందర్భంలో ‘నో’ చెప్పడం ముఖ్యం. నేను ఒక విషయంలో చాలా క్లియర్‌గా ఉంటా. మనం అనుకున్నది జరిగితే సరే.. జరగకపోతే అది ఇంకా మంచిదని నాకు నేను చెప్పుకునేదాన్ని. అవకాశాల కోసం ప్రతి దానికి తలాడించడాల్సిన అవసరం లేదు. నచ్చని విషయాలకు ఇంకో ఆలోచన లేకుండా ‘నో’ చెప్పే ధైౖర్యం యువ తారలకు ఉండాలి. నేను నా మనసు చెప్పిన మాటనే వింటాను. ఎంత పెద్ద అవకాశం అయినా కంఫర్ట్‌గా లేకపోతే దాని జోలిక వెళ్లను. మీకు ఏది సౌకర్యవంతంగా అనిపిస్తుందో దానినే ఎంచుకోండి. నేనూ అదే చేశా. ఒక వేళ నాకు నచ్చకపోతే ‘క్షమించండి. నేనీ ప్రాజెక్ట్‌లో భాగం కాలేను’ అని డైరెక్ట్‌గా చెప్పేసేదాన్ని. బికినీ విషయంలో అలాగే నో చెప్పా. బాగా క్లోజ్‌గా ఉండాల్సిన సీన్స్‌లో నటించడం నాకు నచ్చదు’ అని అన్నారు.

ALSO READ: ఇంకా మొదలెట్టకుండానే.. కాంట్రవర్సీలో ‘గాడ్ ఆఫ్ వార్’

ప్రభాస్‌తో ‘ధురంధర్’ దర్శకుడి మూవీ.. అధికారిక ప్రకటన ఆరోజేనా!

ప్రశ్నించడం అంటే ఇదేనా? రావణ్‌పై రామ్ తాళ్లూరి ఫైర్

Updated Date - Jul 05 , 2026 | 04:40 PM