Lavanya Konidela: మెగాస్టార్ పై విమర్శలు.. ఇచ్చిపడేసిన మెగా కోడలు
ABN, Publish Date - Feb 04 , 2026 | 12:59 PM
సోషల్ మీడియాలో పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ అంతకుమించి ఉంటుంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో.. అంతకుమించి యాంటీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు.
Lavanya Konidela: సోషల్ మీడియాలో పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ అంతకుమించి ఉంటుంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీకి ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో.. అంతకుమించి యాంటీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. మెగా ఫ్యామిలీలో ఏ మంచి జరిగినా శుభాకాంక్షలు చెప్పేవారి కన్నా.. ఆ మంచిని చెడగొట్టే యాంటీ ఫ్యాన్సే ఎక్కువమంది అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు. చిరంజీవి (Chiranjeevi)పై విమర్శలు గుప్పించడమే వారి పని. అలా చిరుపై విమర్శలు గుప్పించిన ఒక నెటిజన్ పై మెగా కోడలు లావణ్య కొణిదెల (Lavanya Konidela) మండిపడింది.
ఈమధ్యనే మెగా ఇంటికి ఇద్దరు వారసులు వచ్చిన విషయం తెల్సిందే. రామ్ చరణ్ - ఉపాసన రెండోసారి ట్విన్స్ కి జన్మనిచ్చారు. దీంతో మెగా ఫ్యామిలీ ఇంట పండుగ వాతావరణం నెలకొంది. సోషల్ మీడియా మొత్తం చరణ్ - ఉపాసనకు శుభాకాంక్షలు చెప్పారు. కానీ, కొంతమంది మాత్రం చిరంజీవిపై విమర్శలు గుప్పించారు. మనవడు పుట్టేసరికి చిరు హాస్పిటల్ వద్ద హడావిడి చేశారని, క్రాకర్స్ కాల్చి సందడి చేశారని.. అదే మనవరాలు క్లింకార పుట్టినప్పుడు ఇదంతా ఏమైంది.. కేవలం మనవడు పుడితేనే హ్యాపీనా అంటూ పోస్టులు పెట్టారు.
తాజాగా ఆ పోస్ట్ పై లావణ్య స్పందించింది. చిరంజీవి ఎలాంటివారో తెలియనప్పుడు ఆయన గురించి మాట్లాడవద్దని తెలిపింది. ఆయనలా ఏ పురుషుడు కూడా ఉండరు అని చెప్పింది. 'నేను సాధారణంగా ఇలాంటి ట్వీట్‌లను పట్టించుకోను. వాటిని నా టైమ్‌లైన్‌లో అలా వదిలేస్తాను. కానీ, మీ నుండి ఇలాంటిది నేను ఊహించలేదు.. ఈ ట్వీట్ చాలా అసభ్యకరంగా ఉంది, ఇది నిజంగా సంతోషకరమైన క్షణాన్ని అసహ్యకరమైనదిగా మార్చింది.
ఆయన తన కుటుంబంలోని మహిళలతో, ముఖ్యంగా తన మనవరాళ్లతో ఎలా ప్రవర్తిస్తారో మీకు స్పష్టంగా తెలియదు. ఆయన చేసే దానిలో 1% కూడా చాలామంది పురుషులు చేయరు. కాబట్టి మీకు నిజంగా తెలియని వ్యక్తుల గురించి వ్యాఖ్యానించకపోవడమే మంచిది' అంటూ ఫైర్ అయ్యింది. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ పోస్ట్ చూసిన మెగా ఫ్యాన్స్ మెగా కోడలు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఎంతైనా మెగా ఫ్యామిలీ కదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
లావణ్య త్రిపాఠి.. చిరంజీవి తమ్ముడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ జంటకు గతేడాది ఒక బాబు జన్మించాడు. అతనికి వాయువ్ తేజ్ అని పేరు పెట్టారు. పెళ్లి తరువాత ఒక వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన లావణ్య ప్రస్తుతం తల్లి బాధ్యతలను నిర్వర్తిస్తోంది. ఆమె నటించిన 'సతీ లీలావతి' సినిమా విడుదల కావాల్సి ఉంది. మరి ముందు ముందు సినిమాలు చేస్తుందా.. ? ఆపేస్తుందా..? అనేది తెలియాల్సి ఉంది.