స్పిరిట్ లేటెస్ట్ లీక్.. క్లైమాక్స్‌లో భారీ ట్విస్ట్! ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హైలైట్?
ABN, Publish Date - Aug 25 , 2026 | 05:17 PM
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న స్పిరిట్ మూవీపై కొత్త బజ్ వైరల్ అవుతోంది.
టాలీవుడ్ లో మోస్ట్ ప్రెస్టీజియస్‌గా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్‌లలో స్పిరిట్ (Spirit) టాప్ ప్లేస్‌లో ఉంటుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. టైటిల్ ఎనౌన్స్‌మెంట్ నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ ఎంపిక చుట్టూ జరిగిన పరిణామాలు కూడా బాగా చర్చనీయాంశమయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దాదాపు 60 శాతానికి పైగా పూర్తయినట్లు సమాచారం. అయితే, ఈ మధ్యకాలంలో సినిమాపై కొన్ని రకాల నెగెటివ్ ప్రచారాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా వెంటనే దిద్దుబాటు చర్యలను మొదలుపెట్టాడు
మొదట్లో ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవల్‌లో మాఫియా బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుందని, ఇందులో కొరియన్ గ్యాంగ్‌స్టర్ డాన్ లీ నటిస్తున్నారంటూ పెద్దఎత్తున వార్తలు వచ్చాయి. కానీ, ఇది పూర్తిగా హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ అనే ప్రచారం జరగడంతో కొంతమంది అభిమానుల్లో నిరుత్సాహం కనిపించింది. సాధారణంగా సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో వేస్టేజ్ చాలా తక్కువగా ఉంటుంది, కథను చాలా గ్రిప్పింగ్‌గా నడిపిస్తారనే పేరుంది.
అయితే, సినిమాను బలాబలాల పరంగా వేగంగా పూర్తి చేస్తున్నారనే ఫీలింగ్ అభిమానుల్లో రాకుండా ఉండేలా దర్శకుడు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా ప్రీ-క్లైమాక్స్ మరియు క్లైమాక్స్ ఎపిసోడ్స్ ప్రభాస్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హైలైట్‌గా నిలవనున్నాయి. అంతేకాకుండా, ఈ సన్నివేశాల్లో వచ్చే భారీ ట్విస్ట్ సినిమాకే ప్రధాన ఆకర్షణగా మారుతుందని, ఇది ప్రేక్షకులను థియేటర్లలో కట్టిపడేస్తుందని వార్తలు వస్తున్నాయి.
రీసెంట్‌గా స్పిరిట్ సినిమా గురించి నిర్మాత ప్రణయ్ రెడ్డి చేసిన కొన్ని వ్యాఖ్యలు ప్రేక్షకులలో బిన్నాభిప్రాయాలు తేవడంతో, ఇదంతా తగ్గిన హైప్‌ను మళ్లీ పెంచడానికి చేస్తున్న ప్రయత్నమేనని కొందరు భావిస్తున్నారు. త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ వైల్డ్ మాస్ అవతార్‌పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. తనదైన మార్క్ టేకింగ్, మేకింగ్ శైలితో సందీప్ రెడ్డి వంగా ఈ లోకల్ కాప్ స్టోరీని ఏ స్థాయిలో నిలబెడతారనే దానిపైనే సినిమా భారీ విజయం ఆధారపడి ఉంది. మొత్తానికి, 'స్పిరిట్' సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరో సరికొత్త సంచలనం సృష్టించడం ఖాయమని సినీ వర్గాలు భావిస్తున్నాయి.