సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

హీరోగా మారుతున్న కేసీఆర్ మనవడు..

ABN, Publish Date - Aug 11 , 2026 | 09:49 PM

సాధారణంగా చిత్ర పరిశ్రమలో సినీ ప్రముఖుల, హీరోల వారసులు కథానాయకులుగా ఎంట్రీ ఇవ్వడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. టాలీవుడ్‌లో అధిపత్యం వహిస్తున్న మెజారిటీ హీరోలు ఇలా సినీ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచే వచ్చినవారే.

Himanshu

సాధారణంగా చిత్ర పరిశ్రమలో సినీ ప్రముఖుల, హీరోల వారసులు కథానాయకులుగా ఎంట్రీ ఇవ్వడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. టాలీవుడ్‌లో అధిపత్యం వహిస్తున్న మెజారిటీ హీరోలు ఇలా సినీ నేపథ్యం ఉన్న కుటుంబాల నుంచే వచ్చినవారే. అయితే రాజకీయ నాయకుల కుటుంబాల నుంచి కథానాయకులుగా రావడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ్ముడు కీ.శే. నారా రామ్మూర్తి నాయుడు కుమారుడైన నారా రోహిత్ బాణం చిత్రంతో కథానాయకుడిగా పరిచయమై, తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే ఇటీవల కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి జూనియర్ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు.


ఇప్పుడు ఇదే క్రమంలో తెలంగాణ రాజకీయాల్లో అత్యంత ప్రముఖమైన కుటుంబం నుంచి మరొక వారసుడు వెండితెరపైకి రావడానికి సిద్ధమవుతున్నట్లు టాక్ నడుస్తోంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) మనవడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు రావు టాలీవుడ్‌లోకి ప్రవేశించనున్నాడనే వార్తలు ఫిలిం నగర్ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ విపరీతంగా ప్రచారమవుతున్నాయి.


ఇప్పటికే సోషల్ మీడియాలో, సంగీత ప్రపంచంలో తన ప్రతిభతో గుర్తింపు తెచ్చుకున్న హిమాన్షు, ఇప్పుడు కథానాయకుడిగా ఒక పవర్‌ఫుల్ ప్రాజెక్ట్‌తో వెండితెరపై కనిపించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని టాక్ నడుస్తోంది. దీనికోసం హిమాన్షు ప్రత్యేకంగా నటన, బాడీ లాంగ్వేజ్‌పై దృష్టి పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చిన్నతనంలో కొద్దిగా బొద్దుగా ఉన్న ఈ కుర్రాడు.. వయస్సు పెరిగేకొద్ది బరువు తగ్గి అందంగా తయారయ్యాడు. అందుతున్న సమాచారం ప్రకారం కేటీఆర్ కొడుకును గ్రాండ్ గా లాంచ్ చేయడానికి తగిన దర్శకుడు వేటలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.

Updated Date - Aug 11 , 2026 | 10:29 PM