సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

KTR: 'ఆకాశంలో ఒక తార'.. కేటీఆర్ మనసులో మాట!

ABN, Publish Date - Nov 27 , 2026 | 10:41 AM

"అసాధ్యమైన కలలు కనడమే కాదు.. వాటిని నిజం చేసుకోవడం ఎంత గొప్ప విషయమో చాటిచెప్పే చిత్రం ‘ఆకాశంలో ఒక తార" అని  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.

"అసాధ్యమైన కలలు కనడమే కాదు.. వాటిని నిజం చేసుకోవడం ఎంత గొప్ప విషయమో చాటిచెప్పే చిత్రం ‘ఆకాశంలో ఒక తార" అని  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తాజాగా ఆయన ఈ సినిమాను వీక్షించి చిత్ర బృందంపై  ప్రశంసల వర్షం కురిపించారు. చాలా కాలం తర్వాత ఇంతటి అందమైన సినిమాను చూశానని, సరళమైన కథతో అద్భుతమైన అనుభూతిని అందించారని కొనియాడారు.ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు "అసాధ్యమైన కలలు కనడమే కాదు.. వాటిని నిజం చేసుకోవడానికి చేసే స్ఫూర్తిదాయకమైన ప్రయాణాన్ని ఈ చిత్రం ఎంతో అందంగా ఆవిష్కరించింది. ‘ఆకాశంలో ఒక తార’ చాలా సరళంగా, అద్భుతంగా ఉంది. చాలా కాలం తర్వాత ఇంతటి అందమైన సినిమాను చూశాను. ముఖ్యంగా దుల్కర్ సల్మాన్, శ్రుతిహాసన్ తమ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాతో పరిచయమైన సాత్విక తొలి చిత్రంతోనే అద్భుతమైన ప్రతిభను చాటుకున్నారు. ఆమె నటనకు ప్రత్యేకంగా అభినందనలు. దర్శకుడు పవన్ సాధినేని కూడా అద్భుతమైన పనితీరును కనబరిచారు. అద్భుతమైన సినిమా అందించిన చిత్ర బృందానికి అభినందనలు" అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.

దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి జంటగా నటించిన ఈ చిత్రానికి పవన్ సాదినేని దర్శకుడు.  గీతా ఆర్ట్స్‌, స్వప్న సినిమా సంస్థల సమర్పణలో లైట్‌బాక్స్‌ మీడియా పతాకంపై సందీప్‌ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మించారు.  శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రధారులు. 

ALSO READ:
Ramayanam: రామాయణం.. అమిత్ షా ఏమన్నారంటే?

ఆడంబరాల పెళ్లి.. ‘ఆత్మగౌరవ వివాహం'లో మిగిలిందేమిటి?

నంది అవార్డుల కమిటీల ఏర్పాటు.. స్పెషల్ అవార్డ్స్ కమిటీ ఛైర్మన్‌గా బాలకృష్ణ

Updated Date - Nov 27 , 2026 | 11:20 AM