సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

FNCC Elections: ఫిలిం నగర్ కల్చరల్ క్లబ్ ఎన్నికల ఫలితాలు..

ABN, Publish Date - Sep 27 , 2026 | 05:19 PM

హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ (FNCC) ఎన్నికలు ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగాయి.

హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ (FNCC) ఎన్నికలు ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగాయి. సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు, క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 3.30 గంటల వరకు కొనసాగింది. ప్రధానంగా కె.ఎస్. రామారావు, ఆదిశేషగిరిరావు ప్యానెళ్ల మధ్య పోటీ నెలకొనడంతో ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. పోలింగ్ ముగిసిన అనంతరం ఓట్ల లెక్కింపు పూర్తి చేసి  ఫలితాలు వెల్లడించారు. FNCC అధ్యక్ష పదవిని కె.ఎస్. రామారావు కైవసం చేసుకున్నారు. సెక్రటరీగా మోహన్ ముళ్లపూడి ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్‌గా సదాశివరెడ్డి, ట్రెజరర్‌గా శైలజ, జాయింట్ సెక్రటరీగా ఎస్.ఎన్. రెడ్డి విజయం సాధించారు. 

ఈ ఎన్నికల్లో మోహన్ ముళ్లపూడి అత్యధికంగా 1,013 ఓట్లు సాధించడం విశేషం. కమిటీ మెంబర్లుగా ఏడిద రాజా, కృష్ణంరాజు, శ్రీనివాసరాజు, కిషోర్, కాజా సూర్యనారాయణ, మురళీ మోహన్ రావు, భాస్కర్ నాయుడు, బాలరాజు, నాగసుష్మ ఎన్నికయ్యారు. అయితే ఈసారి ఎన్నికల ఫలితాల్లో మరో ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. అధ్యక్ష పదవిని దక్కించుకున్న కె.ఎస్. రామారావు ప్యానెల్ నుంచి ఆయన ఒక్కరే విజయం సాధించారు. దీంతో అధ్యక్షుడిగా కె.ఎస్. రామారావు ఎన్నికైనప్పటికీ, ఇతర కీలక పదవుల్లో భిన్న అభ్యర్థులు విజయం సాధించడం చర్చనీయాంశంగా మారింది.

Updated Date - Sep 27 , 2026 | 05:28 PM