కృతిశెట్టి పరాజయం కన్నా.. ఆ బాధే ఎక్కువ..
ABN, Publish Date - Apr 10 , 2026 | 08:18 PM
‘ఉప్పెన’లో బేబమ్మ (Uppena Bebamma) పాత్రతో ఓవర్‌నైట్ స్టార్ అయ్యారు తుళు బ్యూటీ కృతిశెట్టి (Krithishetty). తదుపరి అవకాశాలు వరుస కట్టాయి. కానీ చెప్పుకోదగ్గ విజయం ఆమెను వరించలేదు.
‘ఉప్పెన’లో బేబమ్మ (Uppena Bebamma) పాత్రతో ఓవర్‌నైట్ స్టార్ అయ్యారు తుళు బ్యూటీ కృతిశెట్టి (Krithishetty). తదుపరి అవకాశాలు వరుస కట్టాయి. కానీ చెప్పుకోదగ్గ విజయం ఆమెను వరించలేదు. ఫెయిల్యూర్ గురించి ఎన్నో సందర్భాల్లో ఆమె క్లారిటీ ఇచ్చారు. ‘పని చేయడం మాత్రమే నా చేతిలో ఉంది, ఫలితం నా చేతిలో ఉండదు’ అని తరచూ చెప్పే కృతీ ఈ సారి కాస్త ఓపెన్‌గా మాట్లాడారు. తాజాగా ఆమె నటించిన తమిళ చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. విఘ్నేశ్ శివన్ దర్శకుడు. నయనతార నిర్మాత. ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న కృతీశెట్టి వరుస పరాజయాల గురించి మాట్లాడుతూ ‘ఉప్పెన తర్వాత మళ్లీ అలాంటి పాత్ర నాకు దక్కలేదు. అదే నా కెరీర్‌కు లోటు. సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయనే బాధ కంటే బేబమ్మలాంటి పాత్రలు దక్కట్లేదే అని నాకు బాధ ఎక్కువైపోయింది’ అని తెలిపారు.అయితే తెలుగులో అవకాశాలు లేకపోయినా తమిళనాట బాగానే అవకాశాలు అందుకున్నారు కృతీ. త్వరలో తెలుగులో అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, కల్యాణ్‌రామ్ నటించబోతున్న సినిమా సెట్‌లో అడుగుపెట్టనుంది. ఈ చిత్రం అయినా కృతీకి మంచి విజయం అందిస్తుందని నమ్మకంగా ఉన్నారు.