Vegesna Satish: 'సరిపోయారు ఇద్దరూ' గా 'కోతి కొమ్మచ్చి'!
ABN , Publish Date - Sep 19 , 2026 | 06:20 PM
మేఘాంశ్ శ్రీహరి, సమీర్ వేగేశ్న హీరోలుగా నటించిన సినిమా 'కోతి కొమ్మచ్చి'. ఇప్పుడీ సినిమాను 'సరిపోయారు ఇద్దరూ' పేరుతో దర్శకుడు సతీశ్ వేగేశ్న జనం ముందుకు తీసుకు రాబోతున్నారు.
ప్రముఖ దర్శకుడు సతీశ్ వేగేశ్న తెరకెక్కించిన సినిమా 'కోతి కొమ్మచ్చి'. స్వర్గీయ రియల్ స్టార్ శ్రీహరి తనయుడు మేఘాంశ్‌తో పాటు ఈ సినిమాలో సతీశ్ వేగేశ్న కుమారుడు సమీర్ హీరోగా నటించాడు. రిద్ది కుమార్, మేఘా చౌదరి హీరోయిన్లు. రాజేంద్రప్రసాద్, వి.కె. నరేశ్ కీలక పాత్రలు పోషించగా సిజ్జు, అన్నపూర్ణమ్మ, రాజశ్రీ నాయర్, మణిచందన, ప్రవీణ్, సుదర్శన్, శివన్నారాయణ, ఆనంద్ వర్మ, చింటు, రచ్చ రవి తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. అనూప్ రూబెన్స్ 'కోతికొమ్మచ్చి' సినిమాకు సంగీతం అందించారు. చాలా కాలం క్రితమే అమలాపురం, విశాఖపట్నం, రాజమండ్రిలో ఈ సినిమా షూటింగ్ జరిపారు. అయితే అనివార్య కారణాల వల్ల ఈ సినిమా అప్పట్లో విడుదలకు నోచుకోలేదు.
దర్శకుడు సతీశ్ వేగేశ్న సైతం వేరే ప్రాజెక్ట్స్ తో బిజీ అయి, 'కోతి కొమ్మచ్చి' మూవీని పక్కన పెట్టేశారు. ఇప్పుడాయన ఈ సినిమాను విడుదల చేసే పనిలో పడ్డారు. అయితే... ఈ సినిమాకు కొత్త సొబగులు అద్దే క్రమంలో పేరును కూడా మార్చేశారు. ఇప్పుడీ సినిమా పేరు 'సరిపోయారు ఇద్దరూ'! ఇది వెంకటేశ్, మహేశ్ బాబు హీరోలుగా నటించిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాలోని పాపులర్ డైలాగ్. తన మనవళ్ళను ఉద్దేశించి వాళ్ళ బామ్మగా నటించిన రోహిణీ హట్టంగడి ఈ డైలాగ్ చెబుతుంటుంది. ఆ తర్వాత ఏ ఇద్దరిని పోల్చాల్సి వచ్చినా 'సరిపోయారు ఇద్దరూ' అనడం పరిపాటిగా మారిపోయింది. సతీశ్ వేగేశ్న ఇప్పుడీ సినిమాకు ఇదే టైటిల్ ను ఖరారు చేశారు. వినాయక చవితి సందర్భంగా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అయితే సినిమాను ఎప్పుడు జనం ముందుకు తీసుకొస్తారనేది తెలియాల్సి ఉంది.
ALSO READ:
Raaka: 'రాకా’పై శిబి చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు..
Chiranjeevi: చిరంజీవి నన్ను చెప్పుతో కొట్టినా ఫీలవ్వను.. కానీ అందుకు ఫీలయ్యా
Irumudi: 250 కోట్ల సినిమా.. అసలు లాజిక్స్ లేకుండా ఎలా తీశార్రా బాబు