నిధి చుట్టూ దెయ్యం కథ.. ‘కొరివి’గా వస్తున్న ఎస్ఆర్ కల్యాణమండపం దర్శకుడు
ABN, Publish Date - Nov 02 , 2026 | 03:21 PM
‘ఎస్ఆర్ కల్యాణమండపం’ దర్శకుడు శ్రీధర్ గాదె తెరకెక్కిస్తున్న కొత్త హారర్ మూవీ ‘కొరివి’. ఈశ్వర్ రాచి రాజు హీరోగా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ గ్లింప్స్ తాజాగా విడుదలైంది.
‘ఎస్ఆర్ కల్యాణమండపం’ (SR Kalyanamandapam) చిత్రంతో దర్శకుడిగా ప్రతిభను చాటుకున్న శ్రీధర్ గాదె (Sridhar Gade) రూపొందిస్తున్న కొత్త చిత్రానికి ‘కొరివి’ (Korivi) అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో ఈశ్వర్ రాచి రాజు (Eashwar Rachiraju) హీరోగా నందు మురళీధర్ (Nandu Muraleedhar), నిఖిత (Nikitha) హీరోయిన్లుగా నటిస్తున్నారు.
శ్రీ ఐశ్వర్య లక్ష్మీ మూవీస్ బ్యానర్‌పై వెంకట్ తలారి నిర్మిస్తున్నారు. తాజాగా చిత్రం టైటిల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. మాయా నది ప్రాంతంలో ఉన్న నిధికి కాపుకాసే ఓ కొరివి దెయ్యం కథ ఇది. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ యూనిక్ హారర్ మూవీని సరికొత్త కథా కథనాలతో తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.