సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

‘కొరియన్ కనకరాజు’లో స్పెషల్ సాంగ్ చేసిన హీరోయిన్ ఎవరంటే..

ABN, Publish Date - Jul 16 , 2026 | 10:08 PM

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘కొరియన్ కనకరాజు’. ఈ సినిమా సెకండ్ సింగిల్ అప్డేట్‌ని మేకర్స్ వదిలారు.

Korean Kanakaraju Update

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej), మేర్లపాక గాంధీ (Merlapaka Gandhi) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటోన్న హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju). యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం.. ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ చివరి దశలో ఉంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసిన విషయం తెలిసిందే. టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ సింగిల్, తాజాగా విడుదలై టీజర్‌ అన్నీ కూడా మంచి స్పందనను రాబట్టుకున్నాయి. ఇప్పుడు మేకర్స్ సెకండ్ సింగిల్ అప్డేట్‌ను ఇచ్చారు. దీంతో మరోసారి ఈ సినిమా వార్తలలో హైలెట్ అవుతోంది.


‘రాసగుమ్మడి’ అంటూ సాగే ఫుల్ లిరికల్ సాంగ్‌ను జూలై 19న విడుదల చేయనున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. ఇది ఈ సినిమాలో స్పెషల్ సాంగ్‌గా రానుంది. ఇందులో దక్షా నాగర్కర్‌ ఈ స్పెషల్ సాంగ్‌లో మెప్పించబోతోంది. వరుణ్ తేజ్, దక్షా నాగర్కర్‌పై చిత్రీకరించిన రాసగుమ్మడి సాంగ్ కలర్‌ఫుల్ రాయలసీమ జాతర నేపథ్యంలో తెరకెక్కిన మాస్ డ్యాన్స్ నంబర్‌గా ఉండబోతోందని మేకర్స్ ఈ ప్రకటనలో తెలిపారు. అంతేకాదు, వరుణ్ తేజ్, హీరోయిన్ దక్షా నాగర్కర్ కలర్ ఫుల్ లుక్‌తో ఉన్న పోస్టర్ కూడా వదిలారు. ఈ సాంగ్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ మాస్-ఫెస్టివ్ సాంగ్‌ వైబ్‌ని క్రియేట్ చేస్తోంది.


ఈ పోస్టర్‌లో ఇద్దరి ఎనర్జిటిక్ లుక్స్, ఫెస్టివ్ వైబ్స్ పాటపై అంచనాలను మరింత పెంచుతున్నాయంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. థమన్ సంగీతం అందించిన ఈ పాట మరో చార్ట్‌బస్టర్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. రితికా నాయక్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో కమెడియన్ సత్య కీలక పాత్రలో కనిపించనున్నారు. అగ్రశ్రేణి సాంకేతిక నిపుణులు పని చేస్తున్న ఈ మూవీ సరికొత్త కాన్సెప్ట్, ఆకట్టుకునే విజువల్స్, కమర్షియల్ ట్రీట్‌తో ఆగస్టు 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి:

బొకేలు ఎక్కువ వచ్చినా, తక్కువ వచ్చినా.. నాలో మార్పు రాలేదు: ఐశ్వర్య రాజేష్

సీఎం విజయ్ పాలనపై వరలక్ష్మి శరత్‌కుమార్ షాకింగ్ పోస్ట్..

నితిన్ ‘హ్యాట్రిక్’ సినిమాలు.. ఈసారైనా హిట్ దక్కేనా

Updated Date - Jul 16 , 2026 | 11:54 PM