తెలుగు రాష్ట్రాల్లో ఒక రోజు ముందే వచ్చేస్తోన్న ‘కొరియన్ కనకరాజు’
ABN , Publish Date - Aug 05 , 2026 | 12:38 AM
వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హారర్ కామెడీ ఎంటర్ టైనర్ ‘కొరియన్ కనకరాజు’. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం ఆగస్ట్ 7న గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చేందుకు ముస్తాబవుతోంది.
‘కొరియన్ కనకరాజు’ సినిమాపై ఉన్న కాన్ఫిడెన్స్‌తో ఒక రోజు ముందుగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రీమియర్స్ వేస్తున్నామని తెలిపారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Mega Prince Varun Tej). ఆయన హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హారర్ కామెడీ ఎంటర్ టైనర్ ‘కొరియన్ కనకరాజు’ (Korean Kanakaraju). యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రం ఆగస్ట్ 7న గ్రాండ్‌గా థియేటర్లలోకి వచ్చేందుకు ముస్తాబవుతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా భీమవరంలో ప్రీ రిలీజ్ వేడుకను (Pre Release Event) మేకర్స్ గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ..
‘‘ఈ ‘కొరియన్ కనకరాజు’ సినిమాతో ఆగస్టు 7న థియేటర్లలో నాన్‌స్టాప్ ఎంటర్‌టైన్‌మెంట్ ఉండబోతోంది. డెఫినెట్‌గా అందరూ ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. 2018లో ‘తొలిప్రేమ’ సినిమా ఈవెంట్ కోసం భీమవరం వచ్చాను. ‘తొలిప్రేమ’ తర్వాత మళ్లీ ‘కొరియన్ కనకరాజు’ ఈవెంట్‌ను ఇలా అందరి సమక్షంలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడున్న అందరి ఉత్సాహం చూస్తుంటే ‘తొలిప్రేమ’ మ్యాజిక్ ఈ సినిమాతో మళ్లీ రిపీట్ అవుతుందనిపిస్తోంది. ఈ సినిమాతో నాకు, మా టీమ్ అందరికీ పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. మా నిర్మాతలు చాలా మంచి సపోర్ట్ ఇచ్చారు. మేర్లపాక గాంధీ చాలా మంచి కామెడీ టైమింగ్ ఉన్న దర్శకుడు. తన కెరీర్‌లో మరో పెద్ద హిట్ ఈ సినిమా అవుతుందని నమ్ముతున్నాను. నన్ను ఈ సినిమాలో చాలా కొత్తగా చూపించారు.
థమన్ ఏ హీరో సినిమాకైనా తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. తనతో నాకు ఇది మూడో సినిమా. ఈ సినిమా రీ-రికార్డింగ్ చూశాను. ఈ చిత్రంలో మ్యూజిక్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. చివరి పది రోజులుగా నేను థమన్ దగ్గరే ఎక్కువగా ఉన్నాను. సినిమాకు ఆయన ప్రాణం పోశారు. రితిక గ్రేట్ కో-స్టార్. ఈ సినిమాతో తన విజయ ప్రయాణం కొనసాగాలని కోరుకుంటున్నాను. సత్య క్రేజీ కమెడియన్. ఈ సినిమాలో కృష్ణప్ప పాత్ర చెప్పినప్పుడే సత్య తప్ప ఇంకెవరూ గుర్తుకు రాలేదు. మా ఇద్దరి కాంబినేషన్ ప్రేక్షకులను బాగా అలరిస్తుంది. మిగతా టెక్నికల్ టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ప్రతి సినిమాకు సపోర్ట్ చేస్తూ మాకు ధైర్యం ఇస్తున్న అభిమానులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు గర్వపడే సినిమా ఇది. సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరూ కుటుంబంతో కలిసి థియేటర్‌లో ఈ సినిమా చూడండి.. కచ్చితంగా చూసి ఎంజాయ్ చేస్తారు. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది.
‘ఓజీ’తో సక్సెస్ స్టార్ట్ అయింది, సంక్రాంతికి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ రఫ్ఫాడించారు. ‘పెద్ది’తో చరణ్ అన్న ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చారో అందరికీ తెలుసు. వాళ్ల రేంజ్‌లో కాకపోయినా, నా రేంజ్‌లో ఈ సక్సెస్‌ను కొనసాగించాలని ప్రయత్నిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్యూ. మా సినిమాపై ఉన్న కాన్ఫిడెన్స్‌తో ఒక రోజు ముందుగానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రీమియర్స్ వేయబోతున్నాం. ఆగస్టు 6 రాత్రి నుంచే ‘కొరియన్ కనకరాజు’ థియేటర్లలో అందుబాటులో ఉంటుంది. మీ అందరినీ అలరిస్తుందనే నమ్మకంతో ఒక రోజు ముందే థియేటర్లలోకి తీసుకువస్తున్నాం. ఈ సినిమా అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది’’ అని చెప్పుకొచ్చారు.
ఇవి కూడా చదవండి:
‘రాంబాయి’ కూడా ఫీల్డ్‌లోకి దిగిందిగా!
‘రామాయణ’ డిజైన్ దుస్తుల కాంట్రవర్సీపై డిజైనర్స్ ఫైర్
‘పెద్ది’లోకి స్పైడర్ మ్యాన్.. ఇదెక్కడి వాడకం రా అయ్యా!