సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కొణిదెల పవన్ తేజ్ ‘జంట’.. అమలాపురంలో ఫస్ట్ లుక్‌

ABN, Publish Date - Nov 15 , 2026 | 05:21 PM

కొణిదెల పవన్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘జంట’ ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.

కొణిదెల పవన్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘జంట’ (Janta) ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పాడని కుమార్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వసుంధర ఆర్ట్స్ బ్యానర్‌పై రాజేష్ గునిశెట్టి, వీరు యాదవ్ నిర్మిస్తున్నారు. రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే యూనిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు రాజశేఖర్ యాదవ్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం టైటిల్, ఫస్ట్ లుక్‌ను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మెట్ల రమణబాబు, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మెట్ల రమణబాబు మాట్లాడుతూ "అమలాపురం ప్రాంతంలో గతంలో ‘దసరా బుల్లోడు’తో పాటు ఎన్నో సినిమాల చిత్రీకరణ జరిగిందని గుర్తుచేశారు. ఇప్పుడు ‘జంట’ సినిమా షూటింగ్ కోసం ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. కొణిదెల పవన్ తేజ్‌కు ఇది రెండో సినిమా అని, ఈ చిత్రంతో మెగా ఫ్యామిలీలో మరో పెద్ద హీరోగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.

పవన్ తేజ్ కొణిదెల మాట్లాడుతూ.. "బలమైన కథతో ఈ సినిమా చేస్తున్నాం. ఈ చిత్రంలో హీరోగా నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. సినిమాలో మంచి ఎమోషనల్ డ్రైవ్, మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. మా సినిమా క్యాప్షన్ 'యుద్ధం రాముడితో కాదు.. రాజ్యంతో..'. ఈ క్యాప్షన్ చూసి చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. ఇది మా కథకు యాప్ట్‌గా ఉంటుంది. మొదట్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాలని అనుకున్నాం. ఆంధ్రా వైపు కూడా మన సినిమాల షూటింగ్స్ జరగాలని భావించి అమలాపురంకు షిఫ్ట్ అయ్యాం. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది" అన్నారు.

నిర్మాత రాజేష్ గునిశెట్టి మాట్లాడుతూ.. "ఈ ప్రాజెక్ట్ కోసం రెండేళ్లుగా పనిచేస్తున్నాం. కథకు అనుగుణంగా అమలాపురం పరిసర ప్రాంతాలు సరిపోతాయని భావించి ఇక్కడ షూటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాం" అన్నారు.

‘జంట’ తనకు తొలి తెలుగు సినిమా అని, ఈ అవకాశం రావడం ఆనందంగా ఉందని హీరోయిన్ పాడని కుమార్ తెలిపారు.

అరుణ్ పాండియన్, కల్పలత, నవీన్ నేని, అశోక్, శ్రావణ సంధ్య తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Updated Date - Nov 15 , 2026 | 05:26 PM