'ఉస్తాద్...' స్థానంలోకి 'బ్యాండ్ మేళం'!
ABN, Publish Date - Mar 05 , 2026 | 04:37 PM
'టాక్సిక్' విడుదల వాయిదా పడటంతో పలు చిత్రాల రిలీజ్ డేట్స్ అటూ ఇటూ అయిపోతున్నాయి. 'ఉస్తాద్ భగత్ సింగ్' మార్చి 26 నుండి 19కి ప్రీ పోన్ కాగా, మార్చి 13న రావాల్సిన 'బ్యాండ్ మేళం' మార్చి 26కి వాయిదా పడింది.
‘కోర్ట్’ చిత్రంలో హర్ష్ రోషన్, శ్రీదేవీ అపల్లా అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. మరోసారి ఈ ఇద్దరూ ఓ అందమైన ప్రేమకథతో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ క్యూట్ కాంబోని బ్లాక్ బస్టర్ రచయిత కోన వెంకట్ తెరపైకి తీసుకు వస్తున్నారు. ఈ చిత్రాన్ని కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై కావ్య, శ్రావ్య నిర్మిస్తున్నారు. మ్యాంగో మాస్ మీడియా ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది. సంగీతం, ప్రేమ, భావోద్వేగాలు, మనోహరమైన కథతో ఈ మూవీని సతీష్ జవ్వాజీ తెరకెక్కిస్తున్నారు.
'బ్యాండ్ మేళం' సినిమాను మేకర్స్ తొలుత మార్చి 13న విడుదల చేయాలనుకున్నారు. అయితే ఇప్పుడా సినిమా మార్చి 26కి వాయిదా పడింది. శ్రీరామనవమి కానుకగా తమ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్టు దర్శక నిర్మాతలు తెలిపారు. మార్చి 26న విడుదల కావాల్సిన పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదల వారం ముందుకు మారి... ఉగాది కానుకగా విడుదల కాబోతోంది. మార్చి 19న విడుదల కావాల్సిన 'టాక్సిక్' విడుదల వాయిదా పడటంతో 'ఉస్తాద్' ముందుకు రాగా... 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదల కావాల్సిన మార్చి 26న 'బ్యాండ్ మేళం' రానుంది.