సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Komatireddy Venkat Reddy: ఇండస్ట్రీ గురించి పట్టించుకోకపోతే.. రాజీనామా చెయ్

ABN, Publish Date - Jan 10 , 2026 | 04:33 PM

సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేశానని, సినిమా టికెట్ల ధరల పెంపుకు తన దగ్గరకు రావద్దని సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట రెడ్డి (Komatireddy Venkat Reddy) అన్నారు.

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy: సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేశానని, సినిమా టికెట్ల ధరల పెంపుకు తన దగ్గరకు రావద్దని సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట రెడ్డి (Komatireddy Venkat Reddy) అన్నారు. సినిమా టికెట్ల రేట్ల పెంపుపై తాజాగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ' సినిమా ఇండస్ట్రీ గురించి ఎప్పుడో పట్టించుకోవడం మానేశాను. పుష్ప 2 తరువాత బెన్ ఫిట్ షో లకు, టికెట్ రేట్లు పెంచమని కానీ నా వద్దకు రావద్దని వారం, పది రోజుల క్రితమే చెప్పాను.

ఇప్పటివరకు రిలీజ్ అయినవి కానీ, రేపు రిలీజ్ అయ్యే సినిమాలవి కానీ నా దగ్గరకు ఫైల్ రాలేదు. అప్లికేషన్ కాదు కదా అస్సలు నన్ను ఎవరూ కలవడం లేదు. పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో ఓ మహిళ చనిపోవడం చాలా బాధాకరం. అప్పుడే పర్మిషన్ ఇచ్చినందుకు నేను చాలా బాధపడ్డాను. ఆ బాబు చికిత్స కోసం నా సొంత డబ్బులు కూడా ఇచ్చాను. అప్పటి నుంచే నేను ఈ ఇండస్ట్రీకి సంబంధించిన ఏ విషయంలో జోక్యం చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను' అని అన్నారు.

ప్రస్తుతం కోమటిరెడ్డి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఒక సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయ్యి ఉండి.. ఇలా ఇండస్ట్రీ గురించి పట్టించుకోను అని మీడియా ముఖంగా చెప్పడం పద్దతి కాదని, అంతగా చేయలేకపోతే రాజీనామా చేసి పదవి నుంచి తప్పుకోవచ్చు కదా అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. తమ అభిమాన హీరోల సినిమాల బెన్ ఫిట్ షోస్ కూడా చూడలేకపోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ప్రేక్షకులకు.. ఇటు ఇండస్ట్రీకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఒక సినిమాటోగ్రఫీ మినిస్టర్ గా కోమటిరెడ్డి మీద ఉంది. ఆయన ఈ విషయమై పునరాలోచన చేస్తే బావుంటుందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. మరి కోమటిరెడ్డి వెంకట రెడ్డి దీనిపై ఎలా స్పందిస్తారో చూడాలి.

Updated Date - Jan 10 , 2026 | 05:54 PM