సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

మరోసారి నవ్వించేందుకు వస్తున్న సంపూర్ణేష్ బాబు

ABN, Publish Date - Nov 07 , 2026 | 06:56 PM

సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన హిలేరియస్ కామెడీ మూవీ ‘కొబ్బరిమట్ట’ నవంబర్ 14న రీ రిలీజ్ కానుంది. సాయి రాజేష్ నిర్మించి, స్క్రిప్ట్ అందించిన ఈ సినిమా పరిమిత థియేటర్లలో మరోసారి ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా సాయి రాజేష్, సంపూర్ణేష్ బాబు తమ అనుభవాలను పంచుకున్నారు.

Kobbarimatta Movie

సాయి రాజేష్ స్క్రిప్ట్ అందించి నిర్మించిన హిలేరియస్ మూవీ 'కొబ్బరిమట్ట'. సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన ఈ చిత్రం 14న రీ రిలీజ్ కు రాబోతోంది. ఈ చిత్రాన్ని వల్లంసెట్ల కృష్ణారావు సమర్పణలో అమృత ప్రొడక్షన్స్ బ్యానర్ పై సాయి రాజేష్ నిర్మించారు. ఇషికా సింగ్, గీతాంజలి, షకీలా కీలక పాత్రల్లో నటించారు. 2019 ఆగస్టు 10న ప్రేక్షకుల ముందుకొచ్చిన 'కొబ్బరిమట్ట' ఆద్యంతం నవ్వించి చక్కని విజయాన్ని అందుకుంది.


ఈ సినిమా రీ రిలీజ్ సందర్భంగా రైటర్, ప్రొడ్యూసర్ సాయి రాజేష్ మాట్లాడుతూ, 'నా కెరీర్ లో ఇది ఎంతో స్పెషల్ మూవీ. ఈ సినిమా టైమ్‌లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఫైనాన్స్ పరంగా కష్టాలు చూశాం. ఆ నాలుగేళ్ల శ్రమ ఆగస్టు 10న 'కొబ్బరిమట్ట' రిలీజ్ రోజున మ్యాట్నీ, ఫస్ట్ షోలతో ఫలితాన్నిచ్చింది. ఈ సినిమా సాధించిన విజయం మాకు ఎంతో నమ్మకాన్ని, ధైర్యాన్ని, సంతోషాన్ని అందించింది. నాకు 'బేబి, చెన్నై లవ్ స్టోరీ' సినిమాలు విజయాలు సంతోషాన్నిచ్చినా 'కొబ్బరిమట్ట' అందించిన విజయం మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను. సంపూర్ణేష్ ను 'హృదయ కాలేయం' సినిమాతో పరిచయం చేశాక మా కాంబోలో రెండో చిత్రంగా ఇది వచ్చింది. సంపూతో వర్క్ చేస్తున్నప్పుడు రైటింగ్ లో కొత్త కొత్త ప్రయోగాలు చేశాం. రెండు నిమిషాల నాన్ స్టాప్ డైలాగ్, మూడు నిమిషాల డైలాగ్... ఇలా రాశాను. సంపూ బాగా పర్ ఫార్మ్ చేసేవాడు. ఈ మూవీ డైలాగ్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. మా సంపూర్ణేష్ కోసం ఈ నెల 14న సినిమాను లిమిటెడ్ థియేటర్స్ లో రీ-రిలీజ్ చేస్తున్నాం. అప్పుడు మేం పడిన కష్టాన్ని, మా మెమొరీస్ ను మరోసారి తెరపై చూసుకోవాలని అనుకుంటున్నాం. మిమ్మల్ని మా సినిమా ద్వారా మరోసారి నవ్విస్తామని ఆశిస్తున్నాం. మరో పదిహేను, ఇరవై రోజుల్లో 'బేబి' హిందీ సినిమా షూటింగ్ ఉంది. తర్వాత తెలుగు సినిమా చేస్తాను. ఆ సినిమా స్టోరీ రెడీగా ఉంది' అని అన్నారు.


హీరో సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ, ' కొబ్బరిమట్టలో సాయి రాజేష్ అన్న నాతో మూడు క్యారెక్టర్స్ చేయించారు. ఈ సినిమాలో నాతో 3 నిమిషాల 20 సెకన్ల భారీ డైలాగ్ చెప్పించాడు. సినిమా రిలీజైన ఇన్నేళ్ల తర్వాత కూడా చాలా మంది ఫోన్స్ చేసి మీ 'కొబ్బరిమట్ట' సినిమా మాకు చాలా ఇష్టమని చెబుతుంటారు. అన్న రాసిన స్క్రిప్ట్ వల్లే మా మూవీ అందరికీ గుర్తుండిపోయింది. సాయి రాజేష్ అన్న చెప్పినట్లు ఈ సినిమా టైమ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాం. ఎప్పుడు షూటింగ్ జరుగుతుందో తెలియని పరిస్థితి. కానీ మా సినిమా సాధించిన విజయం అన్నీ మర్చిపోయేలా చేసింది. సాయి రాజేష్ అన్నతో మా కాంబోలో మరో సినిమా తప్పకుండా ఉంటుందని ఆశిస్తున్నాను' అని అన్నారు.


హీరోయిన్ ఇషికా సింగ్ మాట్లాడుతూ,'ఈ సినిమా షూటింగ్ టైమ్ లో ఒక సీనియర్ యాక్టర్ ఇది రిలీజ్ అవుతుందా అని అడిగారు. అప్పుడు మా మూవీ పరిస్థితిని ఆ యాక్టర్ మాటల్లో అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ సినిమాకు ఎన్ని సమస్యలు వచ్చినా సాయి రాజేష్ స్ట్రాంగ్ గా నిలబడ్డాడు. ఒక పోరాటం చేశాడు. మేమంతా సినిమా మీద ప్యాషన్ తో వర్క్ చేశాం. ఇప్పటికీ మా రిలేషన్ అలాగే ఉంది. సక్సెస్ వచ్చినా సాయి రాజేష్, సంపూ ఏమాత్రం మారలేదు. వాళ్లు అలాగే ఉన్నారు' అని చెప్పారు.

ఇవి కూడా చదవండి:

ఎంగేజ్‌మెంట్ తర్వాత తేజ్ ఫస్ట్ రియాక్షన్ ఇదే..

సూర్య కెరీర్‌లో అరుదైన రికార్డ్‌.. తొలి రోజు వసూళ్లలో ‘సీన్‌’ సరికొత్త సంచలనం!

పాతికేళ్ల కుర్రాడితో బెడ్ పై సురేఖావాణి .. నేను కాదంటుందేంటి

Updated Date - Nov 07 , 2026 | 06:56 PM