సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

టైమ్ వచ్చేసింది చరణ్.. క్లిన్ కారా ఫేస్ రివీల్ చెయ్

ABN, Publish Date - Jun 06 , 2026 | 09:07 PM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మాట నిలబెట్టుకునే టైమ్ వచ్చేసింది. అసలు చరణ్ ఏం మాట ఇచ్చాడు.. ? ఇప్పుడెందుకు నిలబెట్టుకోవాలి .. ? అని అంటే..

Ram Charan

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) మాట నిలబెట్టుకునే టైమ్ వచ్చేసింది. అసలు చరణ్ ఏం మాట ఇచ్చాడు.. ? ఇప్పుడెందుకు నిలబెట్టుకోవాలి .. ? అని అంటే.. ఇప్పటివరకు మెగా ప్రిన్సెస్, రామ్ చరణ్ గారాల పట్టీ క్లిన్ కారా ముఖాన్ని ఎవరికీ చూపించలేదు. పదేళ్ల తరువాత చరణ్ - ఉపాసన దంపతులకు కారా పుట్టింది. మెగా ఫ్యామిలీకి ఆమె ఒక మహాలక్ష్మీలా మారింది. ఏ ముహూర్తాన కారా ఇంట్లోకి అడుగుపెట్టిందో అప్పటినుంచి మెగా ఫ్యామిలీలో అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి.


కారా పుట్టి మూడేళ్ళు అవుతోంది. ఇప్పటివరకు ఆమె ముఖాన్ని రివీల్ చేయలేదు. ఇక ఇదే విషయాన్నీ నందమూరి బాలకృష్ణ.. అన్ స్టాపబుల్ షోకి వచ్చినప్పుడు చరణ్ ని అడిగారు. కూతురు ముఖాన్ని ఎప్పుడు అందరికీ చూపిస్తావు అని.. దానికి చరణ్, తాను ఎప్పుడైతే నన్ను నాన్న అని పిలుస్తుందో అప్పుడు చూపిస్తాను అని మాట ఇచ్చాడు. ఇక ఎట్టకేలకు క్లిన్ కారా.. చరణ్ ని నాన్న అని పిలిచింది. అంతేకాకుండా లవ్ యూ సోమచ్ అని కూడా చెప్పింది.


పెద్ది సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో ఉపాసన.. చరణ్ కి ఒక అద్భుతమైన సర్ ప్రైజ్ ఇచ్చింది. అపోలో స్టాఫ్ అందరూ పెద్ది స్టెప్ వేస్తోన్న వీడియోలో చివరన కారా.. నాన్న లవ్ యూ సోమచ్ అని పలికిన మాటలను జోడించి.. సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ముద్దు ముద్దుగా కారా మాట్లాడుతుంటే చాలా క్యూట్ గా అనిపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఈ వీడియో చూసిన ఫ్యాన్స్.. టైమ్ వచ్చేసింది చరణ్.. క్లిన్ కారా ఫేస్ రివీల్ చెయ్. మాట నిలబెట్టుకో అని కామెంట్స్ చేస్తున్నారు. మరి మెగా ప్రిన్సెస్ ముఖాన్ని చరణ్ దంపతులు ఎప్పుడు చూపిస్తారో చూడాలి.

Updated Date - Jun 06 , 2026 | 09:22 PM