ఏఐ టెక్నాలజీతో కిరణ్ కర్నీడి 'స్ట్రైకర్'

ABN , Publish Date - Nov 26 , 2026 | 01:57 PM

23 ఏళ్ల తర్వాత దర్శకుడు కిరణ్ కర్నీడి 'స్ట్రైకర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో రూపొందిన ఈ పాన్ ఇండియా చిత్రం థియేటర్ విడుదలకు సిద్ధమవుతోంది.

Striker Movie

2003లో 'తొలి పరిచయం' చిత్రంతో దర్శకుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన కిరణ్ కర్నీడి 23 ఏళ్ల తర్వాత 'స్ట్రైకర్‌' సినిమాతో మరోసారి తన అదృష్టం పరీక్షించుకోబోతున్నారు. నవంబర్ 25 తన పుట్టినరోజును పురస్కరించుకొని ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ తో తను రూపొందించిన పాన్ ఇండియా ఫీచర్ ఫిల్మ్ 'స్ట్రైకర్' చిత్రానికి సంబంధించిన వివరాలు అధికారికంగా వెల్లడించారు. యూనివర్సల్ మూవీస్ పతాకంపై స్వీయ దర్శకత్వంలో కిరణ్ కర్నీడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విద్యాధికుడైన కిరణ్ కర్నీడి గ్లామర్ టాప్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ గా సేవలందించారు. తెలుగు ఫిలిం డైరెక్టర్ అసోసియేషన్, తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యుడైన కిరణ్ కర్నీడి మార్కెటింగ్‌లో తనకున్న అపార అనుభవానికి, తనలోని సృజనాత్మకతను, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి 'స్ట్రైకర్‌' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.


నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న 'స్ట్రైకర్‌' చిత్రం థియేటర్ రిలీజ్ కు అవసరమైన సాంకేతిక సన్నాహాలు చేసుకుంటోంది. సంప్రదాయ కమర్షియల్ సినిమా విలువలు కొనసాగిస్తూనే, సాంకేతిక మాయాజాలంతో సినిమా నిర్మాణాన్ని కొత్త పుంతలు తొక్కించడం, ఈ రంగంలో కొత్త బాటలు వేయడం ఈ చిత్రం ప్రధాన ఉద్దేశం అని కిరణ్ కర్నీడి తెలిపారు. శక్తివంతమైన సాంకేతికతకు- బలీయమైన భావోద్వేగాలు, పుష్కలమైన వినోదం మేళవించి సినిమాటిక్ అనుభూతిని ఈ చిత్రం అందిస్తుందని కిరణ్ కర్నీడి చెప్పారు. ఈ చిత్రానికి శ్రీనాధ్ మాచర్ల ఎడిటర్‌ కమ్‌ ఎ.ఐ. క్రియేటర్‌గా వ్యవహరిస్తున్నారు. మ్యాజిక్‌ మష్రూమ్స్ స్వరాలు సమకూర్చుతుండగా, శాలిని మిశ్రా నేపథ్యం సంగీతం అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

ఆడంబరాల పెళ్లి.. ‘ఆత్మగౌరవ వివాహం'లో మిగిలిందేమిటి?

బాలయ్య కూతురు సినిమా.. హీరో ఎవరో తెలుసా

ఆయనలా సీఎం అవుతా.. శర్వానంద్ ఏంటి అలా అనేశాడు

Updated Date - Nov 26 , 2026 | 01:59 PM