సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

రియాలిటీ.. రుత్తు సాంగ్ కూడా బాగా హైప్ పెంచేలా ఉందే

ABN, Publish Date - Nov 10 , 2026 | 09:03 PM

కుర్ర హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram).. నెమ్మదిగా ప్రేక్షకుల అభిరుచిని తెలుసుకుంటూ విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఒకప్పుడు ఏడాదికి 4 సినిమాలు రిలీజ్ చేసి ట్రోల్ మెటీరియల్ గా మారిన కిరణ్.. ఆ తరువాత కథను నమ్మి కొత్త కొత్త ప్రయోగాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు

Reality

కుర్ర హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram).. నెమ్మదిగా ప్రేక్షకుల అభిరుచిని తెలుసుకుంటూ విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నాడు. ఒకప్పుడు ఏడాదికి 4 సినిమాలు రిలీజ్ చేసి ట్రోల్ మెటీరియల్ గా మారిన కిరణ్.. ఆ తరువాత కథను నమ్మి కొత్త కొత్త ప్రయోగాలతో ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. తాజాగా కిరణ్ అబ్బవరం నటిస్తూ దర్శకత్వం వహిస్తోన్న చిత్రం రియాలిటీ (Reality). సుధాకర్ చాగంటి నిర్మిస్తోన్న ఈ సినిమాలో కిరణ్ సరసన దేవికా భట్ నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


ఇక ఈమధ్యనే ఈ సినిమా నుంచి రిలీజైన భజగోవిందం సాంగ్ సోషల్ మీడియాని షేక్ చేసిన విషయం తెల్సిందే. ముఖ్యంగా అందులోని లిరిక్స్, ఆ మ్యూజిక్ కి ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ఆ ట్రాన్స్ నుంచే ఇంకా బయటకురాకముందే చిత్రబృందం ఈ చిత్రం నుంచి మరో సాంగ్ ని రిలీజ్ చేయడానికి ముహూర్తం ఖరారు చేసింది. మొదట ఫ్యామిలీ ఆడియెన్స్ ని రాబట్టడానికి భజగోవిందం సాంగ్ ని వదిలిన మేకర్స్ .. ఈసారి లవర్స్ కోసం ఒక మంచి లవ్ సాంగ్ ని రిలీజ్ చేస్తున్నారు. రుత్తు అంటూ సాగే సాంగ్ ప్రోమోని రిలీజ్ చేశారు.


ఈ సాంగ్ ప్రోమో కూడా చాలా బావుంది. భీమ్స్ సిసిరోలియో మ్యూజిక్ మరోసారి మ్యాజిక్ చేయడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక కిరణ్ - దేవిక మధ్య కెమిస్ట్రీ చాలా ఫ్రెష్ గా కనిపిస్తుంది. విజువల్స్ కూడా చాలా రియలిస్టిక్ గా ఉన్నాయి. ఈ ఫుల్ సాంగ్ ని నవంబర్ 12 రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. మొదటి సాంగ్ తోనే ఇండస్ట్రీని షేక్ చేసి మంచి పాజిటివ్ బజ్ తెచ్చుకున్న రియాలిటీ.. ఈ లవ్ సాంగ్ తో మరింత హైప్ క్రియేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రిస్టమస్ కానుకగా డిసెంబర్ 25 న ఈ చిత్రం రిలీజ్ కానుంది. మరి ఈసారి కిరణ్ అబ్బవరం హీరోగానే కాకుండా డైరెక్టర్ గా కుండా ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా చూడాలి.

Updated Date - Nov 10 , 2026 | 09:19 PM