సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kiran Abbavam: ఇలాంటి కథ మీరు చూడలేదు.. నిర్మాతగా మరో అడుగు..

ABN, Publish Date - Aug 25 , 2026 | 09:25 AM

కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి ఇటీవల తిమ్మరాజుపల్లి టీవీ సినిమాను నిర్మించి విజయాన్ని అందుకున్నారు  కిరణ్ అబ్బవరం.

కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించి ఇటీవల తిమ్మరాజుపల్లి టీవీ సినిమాను నిర్మించి విజయాన్ని అందుకున్నారు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). ఇప్పుడు పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ తో కలిసి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని కిరణ్ అబ్బవరం సమర్పణలో అనూష్ గోరక్ (Anoosh Gorak) డైరెక్ట్ చేస్తున్నారు. శివశంకర నాయుడు, కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కుష్లూ మద్దాల, రెహమాన్, నమ్రిత ఎంవీ, తనూజ పుట్టుస్వామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమా అనౌన్స్ మెంట్ సందర్భంగా   వదిలిన పోస్టర్ ఆసక్తికరంగా ఉంది.  పక్షి కాళ్లను చూపిస్తూ, 'ఇలాంటి కథను మీరు ఇప్పటిదాకా తెరపై చూడలేదు, ఇలాంటి జానర్ ను మీరు ఊహించలేదు..'అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీనిబట్టి చూస్తే నిర్మాతగా కిరణ్ ఓ కథను ఎంచుకున్నట్లు అర్థం అవుతోంది. పోస్టర్ఈ చూస్తేనే అది అర్థం అవుతోంది,   మరిన్ని అప్డేట్స్ మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.
 

Updated Date - Aug 25 , 2026 | 09:25 AM