సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కోసి కారం పెడ‌తా.. 'తిమ్మ‌రాజు ప‌ల్లి టీవీ' ట్రైల‌ర్ అదిరింది! తెలుగులో ఇలా కూడా సినిమాలు తీస్తున్నారా

ABN, Publish Date - Apr 09 , 2026 | 05:35 PM

హీరో కిరణ్ అబ్బవరం నిర్మాత‌గా మారి అంతా కొత్త వారితో నిర్మిస్తోన్న చిత్రం 'తిమ్మ‌రాజుప‌ల్లి టీవీ'.

Thimmarajupalli TV

హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నిర్మాత‌గా మారి అంతా కొత్త వారితో నిర్మిస్తోన్న చిత్రం తిమ్మ‌రాజుప‌ల్లి టీవీ (Thimmarajupalli TV). సాయి తేజ్ (Sai Tej Pulula), వేదశ్రీ (Vedha) హీరో హీరోయిన్స్‌గా పరిచయం అవుతుండ‌గా మునిరాజు ( Muniraju) దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 17న ప్ర‌పంచ వ్యాప్త‌గా థియేట‌ర్ల‌కు రానుంది. ఈ నేప‌థ్యంలో ఇప్ప‌టికే విడుద‌ల చేసిన పాట‌లు, టీజ‌ర్ సినిమాపై మంచి అంచ‌నాల‌ను తీసుకు రాగా తాజాగా గురువారం ఓ ప్ర‌త్యేక ఈవెంట్ నిర్వ‌హించి ఈ మూవీ అఫీసియ‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల చేశారు.

ఈ ట్రైల‌ర్‌ను చూస్తే ఔట్ అండ్ ఔట్ ఓ మారుమూల ప‌ల్లెలో 1990ల‌ నేప‌థ్యంలో సినిమాను తెర‌కెక్కించిన‌ట్లు అర్థ‌మ‌వుతోంది. అప్ప‌టివ‌ర‌కు టీవీ అంటే తెలియ‌ని ఊరిలో ఓ యువ‌కుడు టీవీ ప‌ట్టుకు రావ‌డం ఆ త‌ర్వాత ఆక్క‌డి ప్ర‌జ‌ల‌లో జ‌రిగిన వివాదాలు, ఘ‌ర్ష‌ణ‌లు చివ‌ర‌కి అది ఎన్ని ప‌ర్య‌వ‌స‌నాల‌కు దారి తీసింద‌నే క‌థ క‌థ‌నాల‌తో సాగిన‌ట్లు స్ప‌ష్టంగా అర్త‌మ‌వుతోంది.

అంతేగాక విజువ‌ల్స్‌, పాత్ర‌లు, సంగీతం అన్నీ అద్భుతంగా స‌మ‌కూరాయి. నాటి కాలానికి తీసుకెళ్ల‌డ‌మే గాక నాటి రోజుల‌ను గుర్తు చేసేలా స‌న్నివేశాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఫ‌స్ట్ టైం చూసే వారికి స్ట‌న్నింగ్ ఫీల్ ఇవ్వ‌డ‌మే గాక తెలుగులో ఇలాంటి త‌ర‌హాలో కూడా సినిమాలు ఉన్నాయా అని మాట్లాడుకునేలా ఈ ట్రైల‌ర్ ఉంది. ఆల‌స్యం చేయ‌కండి.. ఇప్పుడే మీరూ ట్రైల‌ర్‌పై ఓ లుక్ వేయండి.

Updated Date - Apr 09 , 2026 | 05:35 PM