సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

చెన్నై లవ్ స్టోరీని మిస్ చేసుకున్న బేబీ జంట.. ఎందుకో తెలుసా

ABN, Publish Date - Jul 24 , 2026 | 09:50 PM

పండే ప్రతి గింజ మీద తినేవాడి పేరు రాసి ఉన్నట్లే.. రిలీజ్ అయిన ప్రతి సినిమాలో నటించే వారి పేరు రాసి ఉంటుంది. ఆ రాసి పెట్టిన పేరు ఎవరిది ఉంటుందో.. ఎన్ని అడ్డంకులు దాటుకొని అయినా వారి వద్దకే ప్రాజెక్టు వెళ్తుంది. ఇండస్ట్రీలో ఎన్నో హిట్ సినిమాలు ఒక హీరో కోసం రాసి మరో హీరోతో చేసినవే.

Chennai Love Story

పండే ప్రతి గింజ మీద తినేవాడి పేరు రాసి ఉన్నట్లే.. రిలీజ్ అయిన ప్రతి సినిమాలో నటించే వారి పేరు రాసి ఉంటుంది. ఆ రాసి పెట్టిన పేరు ఎవరిది ఉంటుందో.. ఎన్ని అడ్డంకులు దాటుకొని అయినా వారి వద్దకే ప్రాజెక్టు వెళ్తుంది. ఇండస్ట్రీలో ఎన్నో హిట్ సినిమాలు ఒక హీరో కోసం రాసి మరో హీరోతో చేసినవే. ఇక చెన్నై లవ్ స్టోరీ (Chennai Love Story) కూడా ఆ కేటగిరీలోకే వస్తుంది. టాలీవుడ్‌లో యువతను విశేషంగా ఆకట్టుకున్న కల్ట్ ప్రేమకథా చిత్రాల్లో దర్శకుడు సాయి రాజేష్, నిర్మాత ఎస్ కే ఎన్ కాంబినేషన్‌ ఎలాంటిదో బేబీ సినిమాతోనే రుజువయ్యింది. వారిద్దరి కాంబోలో వచ్చిన మరో కల్ట్ సినిమా చెన్నై లవ్ స్టోరీ. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ తో ముందుకు వెళ్తోంది.


ఇక కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ నటనకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ముఖ్యంగా గౌరీ నటనకు మంచి ప్రశంసలు దక్కుతున్నాయి. అయితే ఈ సినిమాలో హీరో హీరోయిన్ వీరూ కాదు అన్న విషయం చాలా తక్కువమందికి తెలుసు. అవును.. నిజమే. మొదట చెన్నై లవ్ స్టోరీ సినిమా బేబీ జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య వద్దకు వెళ్లింది. అంతా ఫైనల్ అయ్యి.. మేకర్స్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. బేబీ తరువాత ఈ జంట ఏ రేంజ్ లో పాపులర్ అయ్యారో అందరికీ తెల్సిందే. అలాంటి జంట నుంచి మరో సినిమా వస్తుంది అనేసరికి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు.


మరికొద్దిరోజుల్లో షూటింగ్ అనగా ఈ ప్రాజెక్టు నుంచి ఈ జంట తప్పుకున్నారు. రెమ్యూనరేషన్ వద్ద తలెత్తిన సమస్య వలన ఈ సినిమా నుంచి ఆనంద్, వైష్ణవి తప్పుకున్నట్లు టాక్ నడిచింది. ఆ తరువాత ఈ సినిమా ఆగిపోయిందనే అనుకున్నారు. కానీ, సడెన్ గా ఎస్ కే ఎన్ చెన్నై లవ్ స్టోరీ పేరుతో కిరణ్, గౌరీలను దింపాడు. వారు తమ అద్భుతమైన పెర్ఫార్మన్స్‌తో విమర్శకుల నుంచి, ప్రేక్షకుల నుంచి మైండ్ బ్లాకింగ్ ఫీడ్‌బ్యాక్‌ను సొంతం చేసుకుంటున్నారు. ఒకవేళ ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కనుక ఈ సినిమాను వదలకుండా చేసి ఉంటే.. వారి కెరీర్‌లో బేబి తర్వాత మరో సంచలన కల్ట్ క్లాసిక్ క్రెడిట్ పడేది. ఏది ఏమైనా, వైష్ణవి-ఆనంద్ మిస్ చేసుకున్న బ్లాక్‌బస్టర్‌ని కిరణ్ అబ్బవరం తన ఖాతాలో వేసుకుని గ్రాండ్‌గా కంబ్యాక్ ఇవ్వగా, శ్రీ గౌరీ ప్రియ తన నటనతో మరోసారి తనలోని అసలైన సత్తాను నిరూపించుకుంది.

Updated Date - Jul 24 , 2026 | 09:58 PM