సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Kiran Abbavaram: అలా అయితే పవన్ సినిమాని కూడా రిజెక్ట్ చేస్తా

ABN, Publish Date - Jul 18 , 2026 | 07:25 PM

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకప్పుడు ఏడాదికి 5 సినిమాలు చేసి ట్రోల్ కి గురైన కిరణ్.. క సినిమా హిట్ తో రూటు మార్చాడు.

Kiran Abbavaram

టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఒకప్పుడు ఏడాదికి 5 సినిమాలు చేసి ట్రోల్ కి గురైన కిరణ్.. క సినిమా హిట్ తో రూటు మార్చాడు. హీరోగా, నిర్మాతగానే కాకుండా ఈ మధ్యనే డైరెక్టర్ గా కొత్త అవతారం ఎత్తాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇకపోతే ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం చెన్నై లవ్ స్టోరీ (Chennai Lovestory). ఈ సినిమా జులై 24 న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్స్ మొదలుపెట్టిన కిరణ్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై హైప్ పెంచుతున్నాడు.


తాజాగా ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ ఫ్యానిజంపై కిరణ్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. మొదటి నుంచి కిరణ్.. పవన్ కళ్యాణ్ వీరాభిమాని అన్న విషయం అందరికీ తెల్సిందే. సాధారణంగా ఒక అభిమానికి.. తన ఫేవరేట్ హీరో సినిమాలో ఛాన్స్ వస్తే కళ్లు మూసుకొని చేసేస్తాడు. ఆ హీరో పక్కన కనిపించడమే పెద్ద వరమని ఫీల్ అవుతాడు. కానీ, కిరణ్ అలా తాను చేయనని చెప్పుకొచ్చి షాక్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ సినిమా అయినా సరే, మొదట అందులో తన పాత్ర నచ్చాలని, ఒకవేళ క్యారెక్టర్ నచ్చకపోతే ఆ ఆఫర్‌ను తిరస్కరిస్తానని తెలిపాడు.


"సినిమాల్లోకి రాకముందునుంచే పవన్ కళ్యాణ్ అంటే నాకు పిచ్చి, ఆయనకు విపరీతంగా ఫ్యానిజం చేశాను. కాలేజీ రోజుల నుంచి జాబ్ చేసే రోజుల వరకు కూడా పవన్ సినిమాల కోసం చాలా పనులు చేశాను. థియేటర్లలో చొక్కాలు కూడా చింపుకున్నాను. నేను చాలామంది హీరోల సినిమాలు చూస్తాను. వారంటే నాకు ఇష్టం కూడా. కానీ, నేను ఎప్పటికప్పుడు ఫేవరెట్ హీరోలను మార్చే టైప్ కాదు. అప్పటికీ, ఇప్పటికీ, ఎప్పటికీ నా ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ మాత్రమే. ఎంత అభిమాని అయినా కూడా ఆయన సినిమాలో ప్రాధాన్యత లేని పాత్ర చేయమంటే చేయను. అది చిన్న పాత్ర అయినా సరే. లేదు.. నాకు నచ్చిన పాత్ర వస్తే అంతకంటే ఆనందం మరొకటి ఉండదు' అని తెలిపాడు.


ఇదే ఇంటర్వ్యూలో సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న ట్రోలింగ్‌పై కూడా కిరణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. కొందరు సోషల్ మీడియాలో చిన్నచిన్న వీడియోలు పెట్టి తనపై తప్పుడు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని, తాను పెట్టే వీడియోలు నిజమైతే ఏదో ఒక రోజు జనం గుర్తిస్తారని, ఒకవేళ ఫేక్ అయితే ఏదో ఒక రోజు అడ్డంగా దొరికిపోతానని.. కాబట్టి తను ఏంటనేది కాలమే నిర్ణయిస్తుందని తెలిపాడు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత హీరోల కష్టాలు తెలిశాయని, అందుకే ఇప్పుడు ప్రతి హీరోను గౌరవిస్తానని, ప్రేమిస్తానని చెప్పుకొచ్చాడు.

Updated Date - Jul 18 , 2026 | 07:44 PM