సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

కింగ్.. బర్త్ డే కి సర్ప్రైజ్ రెడీ

ABN, Publish Date - Aug 26 , 2026 | 08:37 PM

కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మైల్‌స్టోన్ 100వ చిత్రం కింగ్100. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అత్యంత భారీ స్థాయిలో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు రా కార్తీక్ (Ra Karthik) దర్శకత్వం వహిస్తున్నాడు.

King 100

కింగ్ అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మైల్‌స్టోన్ 100వ చిత్రం కింగ్100. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై అత్యంత భారీ స్థాయిలో నిర్మితమవుతున్న ఈ చిత్రానికి తమిళ దర్శకుడు రా కార్తీక్ (Ra Karthik) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా ద్వారా ఆయన టాలీవుడ్‌కి దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాలో అందాల భామ టబు ఒక అత్యంత కీలకమైన పాత్రలో నటిస్తుంది. గతంలో నిన్నే పెళ్లాడుతా, ఆవిడా మా ఆవిడే వంటి క్లాసిక్స్ తర్వాత మళ్లీ నాగార్జున, టబు కాంబినేషన్ కుదరడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.


ప్రస్తుతం ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ షూటింగ్ వేగవంతంగా జరుగుతోంది.ఇప్పటివరకు నాగ్.. చాలా సైలెంట్ గా షూటింగ్ ని ఫినిష్ చేస్తున్నాడు. ఈ ల్యాండ్‌మార్క్ మూవీకి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ (DSP) సంగీతాన్నీ అందిస్తున్నాడు. ఇక ఈ సినిమా సంక్రాంతికి వస్తోందని కొందరు.. డిసెంబర్ లోనే వస్తోందని కొందరు చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా ఈ చిత్రానికి లాటరీ కింగ్ అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఇక ఈ వార్తలకు చెక్ పెట్టడానికి మేకర్స్ సిద్ధమయ్యాడు.


ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని, అక్కినేని అభిమానులకు, సినీ ప్రియులకు ప్రత్యేక కానుకగా ఈ చిత్రం టైటిల్ గ్లింప్స్ ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మొదటి నుంచి కూడా నాగ్ బర్త్ డే కి ఈ సర్ప్రైజ్ ఉంటుందని ఫ్యాన్స్ ఊహించారు. అనుకున్నట్లుగా టైటిల్ గ్లింప్స్ అనౌన్స్ చేయడంతో అక్కినేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్లింప్స్ లోనే టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించనున్నారట. ఇప్పటివరకు సీనియర్ హీరోలు అయిన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్.. వందకోట్ల క్లబ్ లో చేరారు. నాగ్ ఒక్కడే ఆ రికార్డును బద్దలు కొట్టలేదు. కింగ్ 100 తో ఈ రికార్డ్ సృష్టిస్తాడేమో చూడాలి.

Updated Date - Aug 26 , 2026 | 08:37 PM