సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

King 100: 30 ఏళ్ల త‌ర్వాత.. పండు వ‌చ్చేస్తోంది! కింగ్‌100లో.. ట‌బు ఫిక్స్‌

ABN, Publish Date - Apr 27 , 2026 | 10:03 PM

లీవుడ్ కింగ్ నాగార్జున ప్ర‌స్తుతం త‌న ప్ర‌తిష్టాత్మ‌క 100వ చిత్రం విష‌యంలో త‌ల‌మున‌క‌లై ఉన్న సంగ‌తి తెలిసిందే.

nagarjuna

టాలీవుడ్ కింగ్ నాగార్జున (Nagarjuna) ప్ర‌స్తుతం త‌న ప్ర‌తిష్టాత్మ‌క 100వ చిత్రం విష‌యంలో త‌ల‌మున‌క‌లై ఉన్న సంగ‌తి తెలిసిందే. త‌మిళ‌ డైరెక్ట‌ర్ రా కార్తీక్ (Ra Karthik) ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శ‌ర వేగంగా సాగుతోంది. అయితే.. ఇప్ప‌టివ‌ర‌కు ఈ సిన‌మా గురించి పూర్తి విష‌యాలు, హీరోయిన్ల గురించి ఎలాంటి విష‌యాలు బ‌య‌ట‌కు రాలేదు. కానీ అనుష్క‌, ట‌బు (Tabu), ఐశ్వ‌ర్య రాజేశ్ (Aishwarya Rajesh), సుష్మితా భ‌ట్ (Sushmitha Bhatt) వంటి వారు న‌టిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి సామాజిక మాధ్య‌మాల్లో బాగా న్యూస్ హ‌ల్చ‌ల్ చేసింది. కానీ అవ‌న్నీ పుకార్లుగానే ఉండిపోయాయి.

కాగా.. ఎట్ట‌కేల‌కు ఈ సినిమా క‌థానాయిక‌ల విష‌యంలో ఓ క్లారిటీ వ‌చ్చింది. అంతా అనుకున్న‌ట్లుగానే ట‌బు ఓ హీరోయున్‌గా ఫిక్స్ అయింది. ఈ విష‌యాన్ని ట‌బునే స్వ‌యంగా త‌న ఇన్ స్టా అకౌంట్ ద్వారా ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం ఈ న్యూస్ నెట్టింట వైర‌ల్ అవుతుండ‌గా నిన్నే పెళ్లాడ‌తా (Ninne Pelladatha), ఆవిడ మా ఆవిడే వంటి హిట్ చిత్రాల‌ త‌ర్వాత ట‌బు ఇన్నాళ్ల‌కు నాగార్జున‌తో ముచ్చ‌ట‌గా మూడోసారి జ‌త క‌డుతుండ‌డంతో స‌ర్వ‌త్రా ఎగ్జైట్‌మెంట్ స్టార్ట్ అయింది. ముఖ్యంగా నాగ్ ఫ్యాన్స్ ఆనందంతో ఉబ్బి త‌బ్బిబ‌వుతున్నారు. మూడు ద‌శాబ్దాల త‌ర్వాత గ్రీకువీరుడి కోసం పండు వ‌స్తోందంటూ పోస్టులు పెడుతున్నారు. సంవ‌త్స‌రాలు ఎన్ని మారినా స్టిల్ ఇప్ప‌టికీ ఈ ఇద్ద‌రి వ‌య‌సులో మార్పులేద‌ని నాటి మ్యాజిక్‌నే కంటిన్యూ చేస్తున్నార‌ని పొగ‌డ్త‌లు కురిపిస్తున్నారు.

ఇదిలాఉంటే అన్న‌పూర్ణ స్టూడియోస్ (Annapurna Studios ) బ్యాన‌ర్‌పై నాగార్జున స్వ‌యంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోండ‌గా దేవీ శ్రీ ప్ర‌సాద్ (Devi Sri Prasad) సంగీతం అందిస్తున్నాడు. ద‌స‌రాకు సినిమాను ప్రేక్ష‌కుల ఎదుట‌కు తీసుకు వ‌చ్చేందుకు ఫ్లాన్ చేస్తున్నారు. అయితే.. నాగ్ , ట‌బు కాంబినేష‌న్‌లో వ‌చ్చిన నిన్నే పెళ్లాడ‌తా 1996 ఆక్టోబ‌ర్‌లో రిలీజ్ అయి బాక్సాఫీస్ వ‌ద్ద సునామీ సృష్టించింది. తిరిగి ముప్పై ఏండ్ల త‌ర్వాత ఇప్పుడు ఈ చిత్రం రానుండ‌డంతో స‌ర్వ‌త్రా సినిమాపై అంచ‌నాలు రెట్టింపు అయి ఆకాశాన్ని అంటుతున్నాయి.

Updated Date - Apr 27 , 2026 | 10:03 PM