గాడ్ ఆఫ్ వార్.. లక్కీ ఛాన్స్ పట్టేసిన కియారా
ABN, Publish Date - Jul 20 , 2026 | 04:02 PM
టాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రమేకాకుండా సినీ అభిమానులు అందరూ ఎదురుచూస్తోన్న సినిమాలలో గాడ్ ఆఫ్ వార్ (God Of War) ఒకటి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR)- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబోలో తెరకెక్కనున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.
టాలీవుడ్ ఫ్యాన్స్ మాత్రమేకాకుండా సినీ అభిమానులు అందరూ ఎదురుచూస్తోన్న సినిమాలలో గాడ్ ఆఫ్ వార్ (God Of War) ఒకటి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ (NTR)- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) కాంబోలో తెరకెక్కనున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఒకవైపు ఎన్టీఆర్ తన ప్రాజెక్ట్ డ్రాగన్ షూటింగ్‌లో విపరీతమైన బిజీగా ఉండగా, మరోవైపు త్రివిక్రమ్ తాను తెరకెక్కిస్తున్న ఆదర్శకుటుంబం సినిమా ఫైనల్ టచెస్ ఇచ్చే పనిలో ఉన్నాడు. ఇలా ఎవరి ప్రాజెక్టులలో వారు బిజీగా ఉన్నప్పటికీ, వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న భారీ పౌరాణిక చిత్రంగాడ్ ఆఫ్ వార్ గురించి నెట్టింట రకరకాల కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రం ఇంకా పట్టాలెక్కక ముందే సోషల్ మీడియా వేదికగా విపరీతమైన హల్‌చల్ చేస్తూ ఆడియన్స్‌లో భారీ హైప్‌ను క్రియేట్ చేస్తోంది.
కుమారస్వామి (సుబ్రహ్మణ్య స్వామి) గాథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ పౌరాణిక చిత్రంలో ఎన్టీఆర్ మురుగన్ పాత్రలో కనిపించబోతున్నాడని టాక్. పురాణాల ప్రకారం సుబ్రహ్మణ్య స్వామికి శ్రీవల్లి, దేవసేన అనే ఇద్దరు భార్యలు ఉంటారు. దీంతో ఈ సినిమాలో ఆ రెండు కీలక పాత్రల్లో ఏ హీరోయిన్లు నటిస్తారనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. అయితే అందులో ఒక కథానాయికగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీని ఎంపిక చేసినట్లు సమాచారం. గతంలో వీరిద్దరూ కలసి వార్ 2 చిత్రంలో నటించినప్పటికీ, అందులో కియారా హృతిక్ రోషన్ కి జోడీగా కనిపించింది. ఈసారి మాత్రం నేరుగా ఎన్టీఆర్ సరసన నాయికగా నటించబోతుండటం విశేషం.
అయితే ఈ కాంబినేషన్ అనౌన్స్‌మెంట్ రాకముందే ఎన్టీఆర్ అభిమానుల్లో ఒక రకమైన డౌట్స్, ఆందోళన మొదలయ్యాయి. ఎందుకంటే గతంలో కియారా నటించిన మూడు తెలుగు చిత్రాల్లో రెండు వరుసగా పరాజయాన్ని చవిచూశాయి. ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ తో జోడీ కట్టే కియారా ఈసారి ఏం చేస్తుందో అనే అనుమానాలు పొడసూపుతున్నాయి. ఇకపోతే త్వరలో విడుదల కానున్న టాక్సిక్ కు మంచి బజ్ ఉంది. ఈ మూవీ గనుక సూపర్ హిట్టయితే, కియారాపై ఫ్యాన్స్ లో చోటు చేసుకున్న డౌట్స్ కరిగిపోవచ్చుననీ కొందరు అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.