సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

దగ్గుబాటి కుటుంబం.. ఐదెక‌రాలు కబ్జా చేసింది! నమ్మొద్దన్న.. సురేష్ బాబు లీగల్ టీమ్

ABN, Publish Date - Jun 21 , 2026 | 12:48 PM

మాజీ సైనికుడు షేక్ అహ్మద్‌కు కేటాయించిన ఐదెకరాల భూమిని తప్పుడు పత్రాలతో ఆక్రమించారని మైమూనా బేగం ఆరోపించారు.

Daggubati Suresh Babu

మాజీ సైనికుడైన మా నాన్న షేక్ అహ్మద్‌కు ప్రభుత్వం ఐదెకరాలు ఇవ్వగా తప్పుడు పత్రాలతో ఆ భూమిని కబ్జా చేశారంటూ" మైమూనా బేగం (Maimoona Begum) ఆరోపించింది. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అగ్రిమెంటుదారుడు వాసిరెడ్డి సతీష్ కుమార్, భర్త మహ్మద్ రఫ్ అలీతో కలిసి ఆమె మాట్లాడారు.

ప్రభుత్వం 1994లో మాదాపూర్ పరిధి ఖానామెట్ (Khanamet) సర్వే నంబర్‌ 41/9లో 5 ఎకరాలను కేటాయించింది. 2005లో నాన్న చనిపోయారు. వారసురాలిగా ఆ భూమిని నా పేరుపై మార్పిడి చేసుకోవడానికి వెళ్తే.. సినీ నిర్మాత దగ్గబాటి సురేష్ బాబు (Daggubati Suresh Babu), అతడి సోదరుడు వెంకటేష్ (Venkatesh), తండ్రి రామానాయుడు (Ramanaidu), లక్ష్మీనాయుడు, లక్ష్మీ పేర్లపై రిజిస్ట్రేషన్ చేసినట్లు గుర్తించాం.

మేము ఎవరికీ ఈ భూమిని అమ్మలేదు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి 1992లో నా తండ్రి పేరుతో నకిలీ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ (జీపీఏ) సృష్టించాడు. 1996లో దగ్గుబాటి కుటుంబానికి ఈ భూమిని అమ్మినట్లు తేలింది. ప్రస్తుతం ఈ వివాదం కోర్టులో ఉంది.

మా భూమి పక్కన 21 ఎకరాలు దగ్గు బాటి సురేష్ బాబుకు చెందినది. దాంతోపాటు ఈ ఐదెకరాల భూమిని కలుపుతూ అపర్ణ భవన నిర్మాణ సంస్థ చుట్టూ ప్రహరీ నిర్మించి ఆక్రమించుకున్నది. ఇప్పటికే దీనిపై కలెక్టర్, మాదాపూర్ పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశాం. నేను క్యాన్సర్ పేషెంట్ నలుగురు పిల్లలు ఉన్నారు. నా తండ్రి ద్వారా సంక్రమించిన ఆస్తిని అప్పగించాలి" అని ప్రభుత్వాన్ని కోరింది.

తప్పుడు ప్రచారం నమ్మొద్దు

ఖానామెట్‌లో ఐదెకరాల భూమికి సంబంధించి నిర్మాత సురేష్ బాబుపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఖండిస్తూ ఆయన లీగల్ టీమ్ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. సర్వే నెంబర్ 41/9లో ఉన్న ఐదెకరాల‌ భూమిపై సురేష్ బాబుకు చట్టబద్దమైన యాజమాన్య హక్కులున్నాయని తెలిపింది. 1996 నుంచి ఈ భూమి వారి ఆధీనంలో ఉందని, 2002లో ప్రభుత్వం రికార్డ్ ఆఫ్ రైట్స్ జారీ చేసిందని పేర్కొంది. అన్ని రకాల రెవెన్యూ రికార్డులు, మ్యూటేషన్ పత్రాలు, మా వద్ద ఉన్నాయని తెలిపింది.

Updated Date - Jun 21 , 2026 | 01:22 PM